Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

|

Dec 13, 2024 | 12:16 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని మెప్పించింది. అలాగే స్పెషల్ సాంగ్స్ తో రఫ్పాడించింది. కానీ ఆమె ప్రేమ, పెళ్లి పై మాత్రం సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి.

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Actress
Follow us on

ఈ ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తారలలో ఆమె ఒకరు. ప్రియుడితో కలిసి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ ఆమె ప్రేమ, పెళ్లి వార్తలు మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అలాగే తన పెళ్లిలో ఇద్దరు అన్నయ్యలు కనిపించకపోవడంతో ఫ్యామిలికీ ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంటుందా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇక పెళ్లైన మరుసటి రోజే ఆమె ఆసుపత్రికి వెళ్లడంతో ఒక్కసారిగా ప్రెగ్నెన్సీ రూమర్స్ గుప్పుమన్నాయి. ఇప్పటికీ ఆమె వైవాహిక జీవితం గురించి ఏదోక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా తన గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది ఆ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు. తనే హీరోయిన్ సోనాక్షి సిన్హా.

బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్. హీందీలో అనేక సినిమాల్లో నటించిన సోనాక్షి .. ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. ఇటీవలే తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకుంది. దాదాపు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఈ ఏడాది జూన్ లో ఒక్కటయ్యారు. ప్రస్తుతం తన భర్తతో కలిసి క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే సోనాక్షి డ్రెస్సింగ్ స్టైల్ పై రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. త్వరలోనే ఆమె గుడ్ న్యూస్ చెప్పబోతుందంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు.. ఆమె ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షి తన గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని.. ఇప్పుడు తాను ప్రెగ్నెంట్ కాదని తెలిపింది. పెళ్లి తర్వాత కొంత బరువు పెరగడంతోపాటు లావుగా కనిపిస్తున్నానని.. దీంతో తన గురించి రూమర్స్ ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఇటీవలే డిసెంబర్ 10న తన భర్త జహీర్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించింది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.