
కొందరు హీరోలు, హీరోయిన్లు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఇతర రంగాల్లోనూ ఆసక్తి చూపిస్తుంటారు. ఉదాహరణకు కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ఇప్పుడు కార్ రేసింగుల్లో రయ్ రయ్ మంటూ దూసుకెళుతున్నాడు. అయితే అజిత్ ఒక్కడే కాదు కొందరు హీరోయిన్లు కూడా రేసింగుల్లో దూసుకుపోతున్నారు. అందులో ఈ ప్రముఖ హీరోయిన్ కూడా ఒకరు. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఆమె విదేశాల్లో నిర్వహించే ట్రయథ్లాన్ పోటీల్లో పాల్గొంటోంది. అలా ఏడాది వ్యవధిలో రెండు సార్లు ఐరన్‌మ్యాన్ 70.3 మారథాన్ ను పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా తాజాగా రికార్డు నెలకొల్పింది. గతేడాది సెప్టెంబరులో తొలిసారిగా మెడల్ అందుకున్న ఆమె.. ఇప్పుడు స్వీడన్‌లో నిర్వహించిన రేస్‌లో సత్తా చాటి మరో పతకం అందుకుంది. ట్రయథ్లాన్ … పేరుకు తగ్గట్టుగానే ఈ పోటీలో మూడు రేసులుంటాయి. 1.9 కి.మీ. స్విమ్మింగ్, 90 కి.మీ. సైక్లింగ్, 21.1 కి.మీ. పరుగు ట్రయథ్లాన్‌లో భాగం. అత్యంత కష్టమైన పోటీల్లో ఇదొకటి. అందుకే శారీరకంగా, మానసికంగా ఎంతో బలంగా ఉన్నవారే ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో 2024 సెప్టెంబర్‌లో తొలిసారి ఈ ట్రయథ్లాన్‌ను పూర్తి చేసిన నటి.. తాజాగా జూలై 6న స్వీడన్‌లోని జోంకోపింగ్‌లో తన రెండో ఐరన్ మ్యాన్ 70.3ను విజయవంతంగా పూర్తి చేసింది. తొలిసారి కంటే రెండోసారి 32 నిమిషాల ముందే ఈ రేస్ పూర్తిచేయడం విశేషం. రేస్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుందీ అందాల తార. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్త పట్టారా? తను మరెవరో కాదు తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నటించిన సయామీ ఖేర్.
2015లో తెలుగు చిత్రం రేయ్‌తో సినిమాల్లోకి అడుగు పెట్టింది సయామీఖేర్. ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ గా నటించాడు. దీని తర్వాత ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే కనిపించింది. ఇక 2021లో నాగార్జున అక్కినేనితో కలిసి వైల్డ్ డాగ్ మూవీలో NIA ఏజెంట్‌గా నటించింది. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘జాట్’లో కీలక పాత్ర పోషించింది.
Finished my second Ironman 70.3. And my heart is full. ♥️✌🏽⁰Two races in ten months, while juggling a year full of work… and I’m reminded of one simple truth: discipline always beats excuses. People often ask why I put myself through this kind of torture. pic.twitter.com/jdTwfn44Vq
— Saiyami Kher (@SaiyamiKher) July 8, 2025
ట్రయథ్లాన్‌లో ఏడాది పాటు శిక్షణ తీసుకున్న సయామి.. ఇప్పుడు రేసింగులో అదర గొడుతోంది. .. ‘పది నెలల్లో రెండు రేసులు పూర్తి చేయడం ఆనందంగా ఉంది. ప్రపంచానికి ఏదైనా నిరూపించాలన్నది నా కోరిక కాదు. నేనెప్పుడూ బయట నుంచి వచ్చే గుర్తింపు కోసం ఎదురుచూడను. ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ అనేది నా వ్యక్తిగత ప్రయాణం. అతి శీతల ప్రాంతంలో గడ్డకట్టే నీటిలో ఈత కొట్టడం, గుట్టల్లా ఉన్న ప్రాంతంలో సైక్లింగ్ చేయడం, అంతలోనే పీరియడ్స్ రావడం, ఆపై తుఫాన్ ప్రమాద హెచ్చరికలు.. ఇలాంటి ప్రతికూలతలన్నీ అధిగమించాను’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.
IRONMAN 70.3 Finisher ♥️💪🏽🙏🏽 It was some adventure, freezing cold and getting lost on route! Long post to follow soon, once it all sinks in. @IRONMANtri pic.twitter.com/KoUDWHnDMt
— Saiyami Kher (@SaiyamiKher) September 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.