Vijay Devarakonda: విజయ్ దేవరకొండ‏తో డేటింగ్‏కు రెడీ అంటోన్న ఆ స్టార్ హీరో కూతురు.. అందాల తార ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, ఛార్మీ. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో విజయ్ అటు బాలీవుడ్‏కు పరిచయం కాబోతున్నారు.

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ‏తో డేటింగ్‏కు రెడీ అంటోన్న ఆ స్టార్ హీరో కూతురు.. అందాల తార ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Vijay Devarakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 12, 2022 | 4:48 PM

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‏లో క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ముఖ్యంగా అమ్మాయిలలో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పర్చుకున్న ఈ హీరోను.. ఫ్యాన్స్ ఎక్కువగా రౌడీ హీరో అని పిలుచుకుంటారు. పెళ్లి చూపులు, గీత గోవిందం, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, ఛార్మీ. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో విజయ్ అటు బాలీవుడ్‏కు పరిచయం కాబోతున్నారు.

అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్‏కు సౌత్ టూ నార్త్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా ముంబైలోనే జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. లైగర్ సినిమా విడుదల కంటే ముందే బాలీవుడ్‏లో విజయ్ క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా విజయ్ దేవరకొండతో డేట్‏కు వెళ్లాలని ఉందంటూ మనసులోని మాటను బయటపెట్టింది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్. తాజాగా విడుదలైన కాఫీ విత్ కరణ్ ప్రోమోలో జాన్వీ కపూర్, సారా అలీఖాన్ సందడి చేశారు. ఇందులో వారిద్దరు తమ స్నేహం గురించి చెప్పుకొచ్చారు. అలాగే మీకు డేటింగ్ చేయాలని ఉన్న అబ్బాయి పేరు చెప్పండి అని కరణ్ అడగ్గా.. సారా స్పందిస్తూ విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. నేను నిన్ను విజయ్ దేవరకొండతో చూస్తున్నాను అంటూ కరణ్ జాన్వీని అడగ్గా.. నీకు విజయ్ నచ్చాడా ? అంటూ తిరిగి జాన్వీని ప్రశ్నించింది సారా. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇటీవల లైగర్ సినిమా నుంచి విడుదలైన విజయ్ స్పెషల్ పోస్టర్ పై సారా, జాన్వీకపూర్ స్పందించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.