Nushrratt Bharuccha: ఎట్టకేలకు ఇండియాకు తిరిగి వచ్చిన నటి నుష్రత్‌ బరుచా..

ప్రస్తుతం ఇజ్రాయిల్ లో యుద్ధం జరుగుతోంది. గాజా స్ట్రిప్‌లోని మిలిటెంట్ గ్రూప్ హమాస్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. దాంతో నుష్రత్‌ బరుచా తన టీమ్ తో కాంటాక్ట్ కోల్పోయింది. ఇప్పటికే ఈ యుద్ధం లో చాలా మంది ప్రజలు మరణించారు. వందల మంది మరణించగా.. వేల సంఖ్యలోప్రజలు గాయపడ్డారు. దాంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ క్రమంలో నుష్రత్‌ బరుచా తన కాంటాక్ట్ మిస్ అయ్యింది. అయితే ఎట్టకేలకు ఆమె క్షేమంగా బయట పడింది. ఆమె కాంటాక్ట్ మిస్ అవడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందారు.

Nushrratt Bharuccha: ఎట్టకేలకు ఇండియాకు తిరిగి వచ్చిన నటి నుష్రత్‌ బరుచా..
Nushrratt Bharuccha
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 08, 2023 | 5:23 PM

హైఫా ఇంగర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు బాలీవుడ్ నటి నుష్రత్‌ బరుచా  ఇజ్రాయిల్ వెళ్ళింది. కానీ ఆమెకు అక్కడ ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం ఇజ్రాయిల్ లో యుద్ధం జరుగుతోంది. గాజా స్ట్రిప్‌లోని మిలిటెంట్ గ్రూప్ హమాస్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. దాంతో నుష్రత్‌ బరుచా తన టీమ్ తో కాంటాక్ట్ కోల్పోయింది. ఇప్పటికే ఈ యుద్ధం లో చాలా మంది ప్రజలు మరణించారు. వందల మంది మరణించగా.. వేల సంఖ్యలోప్రజలు గాయపడ్డారు. దాంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ క్రమంలో నుష్రత్‌ బరుచా తన కాంటాక్ట్ మిస్ అయ్యింది. అయితే ఎట్టకేలకు ఆమె క్షేమంగా బయట పడింది. ఆమె కాంటాక్ట్ మిస్ అవడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఆతర్వాత తానొక బేస్‌మెంట్‌లో సురక్షితంగానే ఉన్నానని ఆమె చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇప్పుడు ఆమె ఇండియాకు తిరిగి వచ్చింది.

నుస్రత్‌ ఎట్టకేలకు సురక్షితంగా ఇండియాకు తిరిగి వచ్చింది. ఆదివారం ఆమె ముంబై చేరుకుంది. నుస్రత్‌ ఇండియా కు తిరిగి వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆమె మీడియాతో మాట్లాడటానికి నిరాకరించింది. కొంత సమయం తర్వాత మాట్లాడుతా అని తెలిపింది.

నుస్రత్‌  శివాజీ హీరోగా నటించిన తాజ్ మహల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆతర్వాత తమిళ్ లో ఓ సినిమా చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

ఇండియాకు చేరుకున్న నుస్రత్‌

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.