Nora Fatehi: విమానాశ్రయంలో ఏడుస్తూ వెళ్తున్న హీరోయిన్‌ను సెల్ఫీ అడిగిన అభిమాని.. బాడీ గార్డ్ ఏం చేశాడంటే? వీడియో

నోరా ఫతేహి.. అంటే గుర్తుకు పట్టకపోవచ్చు కానీ.. బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్ బ్యూటీ అంటే ఇట్టే గుర్తుకు వస్తుంది. స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఈ బ్యూటీ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ హరి హరి వీరమల్లులోనూ యాక్ట్ చేసింది.

Nora Fatehi: విమానాశ్రయంలో ఏడుస్తూ వెళ్తున్న హీరోయిన్‌ను సెల్ఫీ అడిగిన అభిమాని.. బాడీ గార్డ్ ఏం చేశాడంటే? వీడియో
Nora Fatehi

Updated on: Jul 07, 2025 | 10:19 AM

బాలీవుడ్ భామ నోరా ఫతేహీ తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయమే. ఎన్టీఆర్ టెంపర్, ప్రభాస్ బాహుబలి, రవితేజ కిక్ 2, షేర్, లోఫర్, ఊపిరి తదితర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిందీ అందాల తార. ఇక లేటెస్ట్ గా వరుణ్ తేజ మట్కా సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది నోరా. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ హరి హర వీరమల్లు మూవీలోనూ ఆమె ఓ కీ రోల్ లో నటిస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజి బిజీగా ఉంటోన్న నోరా ఫతేహి తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఏడుస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే అదే సమయంలో ఒక అభిమాని నోరాతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఏడుస్తూ వెళుతున్న నటితో ఫొటో తీసుకోవడానికి అభిమాని ప్రయత్నించడంతో నోరా బాడీ గార్డ్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. సెల్ఫీ కోసం యత్నించిన యువకుడిని గట్టిగా పట్టుకుని పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నోరా ఫతేహి ఎందుకు ఏడ్చిందో మాత్రం కారణాలు తెలియ రాలేదు. కానీ ఎయిర్ పోర్ట్ కు వస్తున్న ముందే ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో అరబిక్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. నోరా కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువుల్లో ఎవరు ఒకరు మరణించి ఉంటారని, అందుకే ఆమె అలా ఏడుస్తూ వెళ్లిందని ఈ వీడియో చూసిన నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే..గతేడాది క్రాక్, మడ్ గావ్ ఎక్స్ ప్రెస్, మట్కా (తెలుగు) సినిమాల్లో నటించింది. ఇక ఈ ఏడాది
హ్యాపీ, హౌస్‌ఫుల్-5 చిత్రాలతో మెప్పించింది. అలాగే ది రాయల్స్‌ వెబ్ సిరీస్‌లోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లుతో పాటు కాంచన్ 4, అలాగే కన్నడ సినిమా కేడీ- ద డెవిల్ సినిమాల్లోనూ నటిస్తోందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

ఏడుస్తూ వెళుతోన్న నోరా ఫతేహి.. వీడియో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి