Nargis Fakhri: సీక్రెట్‌గా పెళ్లి పీటలెక్కిన హరిహర వీరమల్లు హీరోయిన్.. భర్త ఎవరంటే?

బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న నర్గీస్ ఫక్రి తెలుగు సినిమాల్లోనూ నటిస్తోంది. ఇప్పటికే ‘అమావాస్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పవన్ కల్యాణ్ హహరిహర వీరమల్లు సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

Nargis Fakhri: సీక్రెట్‌గా పెళ్లి పీటలెక్కిన హరిహర వీరమల్లు హీరోయిన్.. భర్త ఎవరంటే?
Nargis Fakhri

Updated on: Feb 22, 2025 | 10:40 AM

‘రాక్‌స్టార్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రి. ఆ తర్వాత మద్రాస్‌ కేఫ్, డిష్యుం, హౌజ్‌ఫుల్‌–3 తదితర సూపర్ హిట్ సినిమాల్లోనూ నటించింది. హాలీవుడ్‌ సినిమా ‘స్పై’లోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్ తో కలిసి హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. ఇక సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితం కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది నర్గీస్. ఇప్పుడీ అందాల తార రహస్యంగా వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆమె పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నటి నర్గీస్ ఫఖ్రీ లాస్ ఏంజిల్స్‌లో వివాహం చేసుకుంది. ఈ వివాహం చాలా ప్రైవేట్ పద్ధతిలో జరిగింది. ఆమె వివాహానికి కేవలం సన్నిహితులు, కొంతమంది కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు. ఈ కొద్దిమంది సమక్షంలోనే నర్గీస్ టోనీని వివాహం చేసుకుంది. అయితే తమ పెళ్లి గురించి ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. ఇక వివాహం తర్వాత, నర్గీస్, టోనీ తమ హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు.

నర్గీస్ భర్త ఎవరంటే?

కాగా నర్గీస్ ఫక్రీ, టోనీ 2022 నుంచి డేటింగ్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో దాదాపు మూడు సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత వారు వివాహం చేసుకున్నారు. నర్గీస్ భర్త విషయానికి విస్తే.. టోనీ కాశ్మీర్‌లో జన్మించాడు. కానీ అతను ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తున్నాడు. అతను వృత్తిరీత్యా వ్యాపారవేత్త. ‘ది డియోస్ గ్రూప్’ అనే దుస్తుల వస్తువుల సంస్థ వ్యవస్థాపకుడిగా కొనసాగుతున్నాడు. టోనీ ఈ కంపెనీని 2006 లో ప్రారంభించాడు. ఇప్పుడు అతను నర్గీస్‌ను వివాహం చేసుకున్నందున వార్తల్లో నిలుస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

నర్గీస్ ఫక్రీ లేటెస్ట్ ఫొటోస్..

నర్గీస్ బాలీవుడ్ లో చాలా పాపులర్ నటి. ఆమె 2011లో దర్శకుడు ఇంతియాజ్ అలీ చిత్రం ‘రాక్‌స్టార్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఆమె బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ సరసన నటించింది. ఆ సమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారని ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు నర్గీస్ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా షేర్ చేసిన కేక్‌పై నర్గీస్, టోనీ పేర్లు రాసి ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.