AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి అజిత్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు తగ్గట్టుగానే ఫిబ్రవరి 06న విడుదలైన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో ఈ మూవీని తెరకెక్కించారు.

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి అజిత్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Ajith Kumar
Basha Shek
|

Updated on: Feb 22, 2025 | 10:00 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా విదాముయర్చి. తెలుగులో పట్టుదల పేరుతో రిలీజైంది. మేయిళ్ తిరుమేని తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటించింది. అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6వ తేదీన తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. పోస్టర్స్, సాంగ్స్ , ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. అయితే ఆ తర్వాత క్రమంగా వసూళ్లు పడిపోయాయి. అయినా అజిత్ మేనియాతో సినిమాకు రూ. 130 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. ఇక అజిత్ నటన, యాక్షన్ సీక్వెన్స్, త్రిష అంద చందాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన అజిత్ పట్టుదల మూవీ ఇప్పుడు ఓటీటీలోకా రానుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజైన 50 రోజులకు అంటే.. మార్చి ఆఖరి వారం లో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే థియేట్రికల్ రన్ అనుకున్న విధంగా లేకపోవడంతో ముందుగానే ఈ సినిమా స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. మార్చిమొదటి వారంలోనే అజిత్ సినిమాను స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురా వొచ్చని ప్రచారం జరుగుతోంది.

బ్రేక్‍డౌన్ అనే హాలీవుడ్ సినిమా కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు మేయిళ్ తిరుమేని. ప్రతిష్ఠాత్మక లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అరవ్, నిఖిల్ సజిత్, దాశరథి, రవి రాఘవేంద్ర, జీవ రవి, గణేశ్ శరవణన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు, బీజీఎమ్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను..
మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను..
స్టార్ల వైఫల్యంపై ముంబై కోచ్ జయవర్ధనే షాకింగ్ కామెంట్స్
స్టార్ల వైఫల్యంపై ముంబై కోచ్ జయవర్ధనే షాకింగ్ కామెంట్స్
ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్.. ఈ రెండిటిల్లో ఏది మంచిది..?
ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్.. ఈ రెండిటిల్లో ఏది మంచిది..?
పట్టపగలు తుపాకులతో గోల్డ్‌ షాప్‌లోకి చొరబడిన దొంగలు.. తర్వాత సీన్
పట్టపగలు తుపాకులతో గోల్డ్‌ షాప్‌లోకి చొరబడిన దొంగలు.. తర్వాత సీన్
ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం..
ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం..
మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇవి ఇవ్వండి..
కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇవి ఇవ్వండి..
కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..
కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..
సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు చూస్తే గర్వంగా ఉంది..
సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు చూస్తే గర్వంగా ఉంది..
మా టైం బాగోలేదు.. ఈ సీజన్ మాది కాదు.. హార్దిక్ సంచలన వ్యాఖ్యలు
మా టైం బాగోలేదు.. ఈ సీజన్ మాది కాదు.. హార్దిక్ సంచలన వ్యాఖ్యలు