Kriti Sanon: ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్
హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన కృతిసనన్ తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అలాగే మొన్నామధ్య ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమాలో సీతగా కనిపించి మెప్పించింది కృతిసనన్. అయితే కృతి సనన్ కు సంబందించిన ఓ వార్త ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ఈ అందాల భామ చేసిన పనికి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
బాలీవుడ్ నటి కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అమ్మడు. ఆ తర్వాత అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య తో కలిసి దోచేయ్ అనే సినిమా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్ కు చెక్కేసింది. హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన కృతిసనన్ తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. అలాగే మొన్నామధ్య ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమాలో సీతగా కనిపించి మెప్పించింది కృతిసనన్. అయితే కృతి సనన్‌కు సంబందించిన ఓ వార్త ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ఈ అందాల భామ చేసిన పనికి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
ఇది కూడా చదవండి : Vishnu Priya : నేను తుప్పుపట్టిన పీస్.. ఆమె గొప్ప పీస్.. విష్ణుప్రియ ఇలా అనేసిందేంటీ..!
కృతి సనన్ ప్రస్తుతం గ్రీస్ వెకేషన్‌లో ఉంది. ఇందుకు సంబందించిన వీయస్యో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ యువతీ హాయిగా నిలబడి సిగరెట్ తాగుతూ కనిపించింది . ఈ వీడియో చూసిన పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆమె హీరోయిన్ కృతిసనన్ అని ఆమెను తిట్టిపోస్తున్నారు. కృతి సనన్ ఇటీవలే తన పుట్టినరోజును జరుపుకుంది. తన ప్రియుడు కబీర్ బహియాతో కలిసి ఈ అమ్మడు గ్రీస్ వెళ్లింది. గ్రీస్ లో ప్రియుడితో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది.
ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈవిడ చంద్రముఖిలో వడివేలు భార్య..!! చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే
తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ యువతి సిగరెట్ తాగుతూ కనిపించింది. ఈ వీడియోలో ఉన్నది కృతి సనన్ అని కొందరు అంటున్నారు. మరికొందరు ఆమె కాదు.. కానీ అచ్చం ఆమెలాన్ ఉంది అని వాదిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. కొందరు నెటిజన్స్ కృతిసనన్ పై విమర్శలు చేస్తున్నారు. ‘రోల్ మోడల్‌గా ఉండాల్సిన వారు ఇలా తయారవుతున్నారు’ అని కొందరు అంటుండగా.. ‘గ్లామర్ ఒక్కటే సరిపోదు, ఆరోగ్యం కూడా కావాలి’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
కొంతమంది ఆమెకు మద్దతు కూడా ఇచ్చారు. ‘ఇది ఆమె ప్రైవేట్ విషయం. విదేశాల్లో ఏం చేసినా వారి ఇష్టం. వారు సిగరెట్లను ప్రోత్సహించడం లేదుగా. అలాంటప్పుడు ఎందుకు దాన్ని పెద్దది చేస్తున్నారంటూ’ కొందరు ఫైర్ అవుతున్నారు. సెలబ్రెటీలు సిగరెట్స్ తాగడం చాలా కామన్.. అందులో ఏముంది అని కృతిసనన్ కు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఉన్నది కృతిసనన్ అయ్యిఉండదని ఆమె అభిమానులు చెప్తున్నారు. ఆమె కృతిసననే అని ఖచ్చితంగా చెప్పలేం. గతంలో అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో తాను సిగరెట్ తాగనని తెలిపింది కృతి. ‘నేను ధూమపానం చేయను. నా పాత్ర కోరితేనే చేతిలో సిగరెట్ పట్టుకుంటానని అంతే అని చెప్పుకొచ్చింది. అలాగే కృతిసనన్ తల్లి కూడా గతంలో కృతి స్మోకింగ్ చేయదు అని చెప్పింది.
Kristi Sanon smoking in Greece byu/Stunning_Cow_5233 inBollyBlindsNGossip
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి