
ముఖానికి మాస్క్ వేసుకుని ముసిముసి నవ్వులు చిందిస్తోన్న ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా? ఆమె ఒక స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు హిందీలో సినిమాలు చేసింది. తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ తదితర స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగొందుతోన్న ఈ సొగసరి ఓ స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమ దాంపత్య బంధానికి ప్రతీకగా ఇటీవలే అమ్మగా ప్రమోషన్ పొందింది. విహాన్ అనే పండంటి బాబుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ పిల్లాడి పెంపకంలో బిజీగా ఉన్న ఈ అందాల తార ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటోంది. బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత ఇలా ముఖానికి మాస్క్ వేసుకుని దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లందరూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మాస్క్ చాటున ఉన్న ఈ ముద్దుగుమ్మను మీరు గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు మల్లీశ్వరిగా తెలుగు అభిమానుల మనసులు గెల్చుకున్న కత్రినా కైఫ్.
బాలీవుడ్ లో స్టార్ కపుల్ గా పేరొందిన కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ గతేడాది ఆఖరులో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. 2025 నవంబర్ 7వ తేదీన కత్రినా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తమ బిడ్డకు విహాన్ కౌశల్ అని పేరు పెట్టుకున్నారు. ప్రస్తుతంఈ పిల్లాడి పెంపకంలోనే బిజీగా ఉంటోంది కత్రినా. ఇక చాలా మంది సెలబ్రిటీ ల్లాగే కత్రినా దంపతులు కూడా తమ బిడ్డ విషయంలో చాలా ప్రైవసీని పాటిస్తున్నారు. తమ కుమారుడి ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
Public Mein Katrina Kaif Ka Rare Sighting!#KatrinaKaif #RareSighting #PublicAppearance #BollywoodStar #Mumbai #BollywoodUpdates #FansReact #CelebrityVibe pic.twitter.com/duiISc76Al
— B4U (@THEOFFICIALB4U) February 26, 2026
ఇక సినిమాల విషయానికి వస్తే.. కత్రినా సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులైంది. చివరిసారిగా 2024లో మేరీ క్రిస్మస్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిందీ ముద్దుగుమ్మ. ఆతర్వాత గర్బం ధరించడంతో సినిమాలకు విరామం ప్రకటించింది కత్రినా. త్వరలోనే ఆమె తన తర్వాతి ప్రాజెక్టు గురించి ప్రకటించే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి