Actress: షాకింగ్ లుక్‌లో స్టార్ హీరోయిన్.. అమ్మయ్యాక ఇలా మారిపోయిందేంటి? వైరల్ వీడియో
ఓ ప్రముఖ హీరోయిన్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె లుక్ చూసి నెటిజన్లు అయోమయంలో పడ్డారు. గుర్తు పట్టలేకున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ స్టార్ హీరోయిన్ ఇటీవలే ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధించి ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎంతో మందిబాలీవుడ్ సెలబ్రిటీలకు వెడ్డింగ్ దుస్తులను డిజైన్ చేశాడు సబ్యసాచి. కాగా సబ్యసాచి ముఖర్జీ బ్రాండ్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా ముంబైలో పెద్ద ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ర్యాంప్ వాక్ చేసింది. ఫ్యాషన్ షోలో దీపిక అద్వితీయమైన లుక్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె తెల్లటి ప్యాంటు, చొక్కా దానిపై ట్రెంచ్ కోటు ధరించింది. ఇక దీపికా హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంది. అయితే ఆమె ఓవరాల్ పర్సనాలిటీ చూసిన చాలా మంది దీపిక ప్రముఖ నటి రేఖలా మారిపోయిందని వ్యాఖ్యానిఇంచారు. “ఇది దీపికా లేదా రేఖ” అని నెటిజన్ అడిగాడు. దీపిక ర్యాంప్ వాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్ల నుంచి రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి. దీపికతో పాటు సోనమ్ కపూర్, అలియా భట్, అదితి రావ్ హైదరీ తదితర స్టార్ హీరోయిన్లు కూడా రెడ్ కార్పెట్‌పై ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
ప్రముఖ నటి అలియా భట్ కూడా రెడ్ కార్పెట్‌పై చీరకట్టుతో అందరి దృష్టిని ఆకర్షించింది. అలియా నల్లటి చీర కట్టుకుని దానిపై స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ని ధరించింది. దీపిక గతేడాది సెప్టెంబర్ 8న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రణవీర్, దీపికా తమ కూతురికి ‘దువా’ అని పేరు పెట్టారు. తన కుమార్తె పుట్టిన తర్వాత, దీపిక మొదటిసారి గాయకుడు దిల్జిత్ దోసాంజ్ కచేరీలో కనిపించింది. ఆ తర్వాత సబ్యసాచి షో కారణంగా దీపిక ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
రేఖలా మారిపోయిందేంటి?
Slay Queen! 😍#DeepikaPadukone opens the show for #Sabyasachi looking gorgeous as ever. #25YearsOfSabyasachi pic.twitter.com/Hdae5FYk8F
— Filmfare (@filmfare) January 25, 2025
కూతురికి జన్మనిచ్చిన నాలుగు నెలల తర్వాత, దీపికా పదుకొణె బయటకు వచ్చింది. ఇందుకోసం ఆమె ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఛాయాచిత్రకారులు, ఫోటోగ్రాఫర్లు మాత్రమే హాజరయ్యారు.
సబ్యసాచి ఈవెంట్ లో దీపిక..
Deepika Padukone & Christy Turlington for the Sabyasachi show in Mumbai tonight!!!!!💗💗💗🤩🤩🤩😍😍😍slayed so hard thank you so much for showing what true Indian luxury fashion is #sabyasachi 👏🏼👏🏼 pic.twitter.com/z3zO4yr7zx
— 💗r (@gem1n1saturn) January 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








