ఇంటిమేట్ సీన్ అనగానే రెచ్చిపోయాడు.. దెబ్బకు హీరోయిన్ షాక్.. కట్ చేస్తే పోలీస్ కేసు

రీసెంట్ డేస్ లో సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ కు, బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారుతున్న జనరేషన్స్ కు తగ్గట్టుగా సినిమాల్లోనూ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అలాగే యాక్షన్ సీన్స్ తో పాటు ఇంటిమేట్ సీన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మనదగ్గర బోల్డ్ సీన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇంటిమేట్ సీన్ అనగానే రెచ్చిపోయాడు.. దెబ్బకు హీరోయిన్ షాక్.. కట్ చేస్తే పోలీస్ కేసు
Actress

Updated on: Jun 22, 2025 | 2:41 PM

సినిమాల్లో రొమాంటిక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ కు కొదవే లేదు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చాలా కామన్ అయ్యాయి. అయితే కొంతమంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి వెనకాడటం లేదు.. సినిమా కథ డిమాండ్ చేస్తే ఎలాంటి రోల్స్ అయినా.. ఎలాంటి సీన్స్ అయినా చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం అయిష్టంగానే రొమాంటిక్స్ సీన్స్ లో నటిస్తున్నారు. అలాగే చాలా మంది నటీమణులు తమకు సినిమా సెట్స్ లో ఎదురైనా చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు. అయితే ఓ హీరోయిన్ తన పర్మిషన్ లేకుండా సినిమాలో రేప్ సీన్ పెట్టారని ఏకంగా హీరో పైనే కేసు పెట్టింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆ సినిమా ఎదో మీకు తెలుసా.?

ఇది కూడా చదవండి : అప్పుడు మాస్ రాజా సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఏకంగా రవితేజ మూవీలో గెస్ట్ గా..

తనకు చెప్పిన కథలో ఆ సీన్ లేదని, అలాగే అగ్రిమెంట్ లోనూ అది లేదని తెలిపింది. కానీ సినిమా సెట్ లో మాత్రం రేప్ సీన్ షూట్ చేశారని తెలిపింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన అయేషా జుల్కా. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇక ఈ స్టార్ హీరోయిన్ అప్పటి హీరో మిథున్ చక్రవర్తి తో కలిసి ఓ సినిమాలో నటించినందుకు బాధపడుతున్నట్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఏం సినిమారా అయ్యా..! మెంటలెక్కి పోవాల్సిందే.. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం మంచిది

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఓ మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన ఓ సినిమాలో తన పర్మిషన్ లేకుండా.. ఓ రేప్ సీన్‌లో తన బాడీ డబుల్ వాడి ప్రొడ్యూసర్లు మోసం చేశారని ఆరోపించింది. పార్థో ఘోష్ డైరెక్షన్‌లో వచ్చిన ‘దలాల్’ మూవీలో అయేషా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా కథ విన్నప్పుడు, అగ్రిమెంట్ లో ఎక్కడా కూడా తనకు రేప్ సీన్ గురించి చెప్పలేదట. అయితే తనకు చెప్పకుండా.. తన పర్మిషన్ లేకుండా రేప్ సీన్ షూట్ చేశారట. అది చూసిన చాలా మంది ఎందుకు ఇలా చేశావ్.? అని తనను అడిగారట దాంతో ఆమె ఆగ్రహం ఆపుకోలేక ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌లో కేసు వేసి, కంప్లైంట్ చేసినట్టు తెలిపింది అయేషా..

ఇది కూడా చదవండి : గుర్తుందా మావ..! అప్పట్లో టిక్ టాక్‌ను ఊపేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి