Tollywood: సహనం కోల్పోయిన స్టార్ హీరో.. కోపంతో అభిమాని దగ్గరకు వెళ్లి.. వీడియో వైరల్

సినిమా హీరోలు, హీరోయిన్లు బయట కనిపిస్తే చాలు.. వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడతారు. ఇది నటులకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఈ సమయంలో కొందరు స్టార్స్ ఓపికతో వ్యవహరిస్తే మరికొందరు మాత్రం సహనం కోల్పోతుంటారు. ఇప్పుడు ఓ స్టార్ హీరో కూడా అభిమానిపై ఫైర్ అయ్యాడు.

Tollywood: సహనం కోల్పోయిన స్టార్ హీరో.. కోపంతో అభిమాని దగ్గరకు వెళ్లి.. వీడియో వైరల్
Akshay Kumar

Updated on: Jul 21, 2025 | 6:45 AM

మన దేశంలో సినిమా సెలబ్రిటీలు బయట తిరగాలంటే ఎన్నో ఇబ్బందుల ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా అభిమానులు ఫొటోలు, సెల్ఫీల కోసం నటులను చుట్టుముట్టేస్తారు. అందుకే విరాట్ కోహ్లీ లాంటి చాలా మంది సెలబ్రిటీలు విదేశాలకు వెళ్లి అక్కడ స్వేచ్ఛగా వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు విదేశాల్లోనూ అభిమానులు సెలబ్రిటీలను గుర్తు పడుతుంటారు. ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. ఇప్పుడు ఇలాంటి అనుభవమే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు ఎదురైంది. ప్రస్తుతం ఆయన లండన్ పర్యటనలో ఉన్నారు. అక్కడి వీధుల్లో ఎంతో స్వేచ్ఛగా, జాలీగా తిరుగుతూ కనిపించారు. అయితే అక్షయ్ కుమార్ ను గుర్తించిన ఒక అభిమాని వెంటనే తన మొబైల్ లో నటుడిని ఫొటోలు తీయడం స్టార్ట్ చేశాడు. ఇది గమనించిన అక్షయ్
వెంటనే అభిమాని ఫోన్ లాక్కున్నాడు. అతని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఇలా ఫొటోలు, వీడియోలు తీయడం సరైనది కాదంటూ మండి పడ్డాడు. అయితే చివరికి ఆ అభిమానితో కలిసి అక్షయ్ కుమార్ సెల్ఫీకి ఫోజులిచ్చినట్టు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అక్షయ్ కుమార్ అభిమానులు తమ హీరోకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. థోడా ప్రైవసీ దే దో భాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడూ కూడా ఒకరి అనుమతి లేకుండా వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయడం కరెక్ట్ కాదంటూ సదరు అభిమానిపై మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం అక్షయ్ కుమార్ పై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

ఇక సినిమాల విషయానికి వస్తే..ఇటీవల కన్నప్ప సినిమాలో శివుడగా కనిపించారు అక్షయ్. అలాగే హౌస్ ఫుల్ 5 అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీని తర్వాత భూత్ బంగ్లా, వెల్కమ్ టు ది జంగిల్, జాలీ ఎల్‌ఎల్‌బి 3, హైవాన్ తదితర ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు అక్షయ్.

 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి