
ఇటీవల బాలీవుడ్ తారలు దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ, బాబీ డియోల్, ఆమిర్ ఖాన్ తదితరులు తెలుగుతో పాటు దక్షిణాది సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఈ వరుసలో మరో బాలీవుడ్ స్టార్ చేరుతున్నాడు. అతనే అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్. హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటోన్న అభిషేక్ ఇప్పుడు తొలిసారిగా దక్షిణ భారత చిత్రంలో నటించబోతున్నాడని సమాచారం. ఇంతకు ముందు ప్రభాస్ నటించిన పాన్-ఇండియా చిత్రం ‘కల్కి 2898 AD’లో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సీక్వెల్‌లో కూడా బిగ్ బీ నటించనున్నారు. ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రంలో అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో ‘ఫౌజీ’ కూడా ఒకటి. స్వాతంత్య్రానికి ముందు జరిగిన ప్రేమకథ గా ఈ మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది. ‘సీతా రామం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీకి దర్శకత్వం వహించిన హను రాఘవ పూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. ‘ఫౌజీ’ చిత్ర బృందం ఇప్పటికే అభిషేక్ బచ్చన్‌తో చర్చలు జరిపిందని, అతనికి కూడా కథ నచ్చి ఈ చిత్రం చేయడానికి అంగీకరించారని టాక్. అభిషేక్ బచ్చన్ వీలైనంత త్వరగా ‘ఫౌజీ’ బృందంలో చేరతారని సమాచారం. అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ‘కింగ్’, రితేష్ దేశ్‌ముఖ్ ‘రాజా శివాజీ’ చిత్రాల్లో నటిస్తున్నాడు. కాగా ‘ఫౌజీ’ అభిషేక్ బచ్చన్ నటించిన తొలి దక్షిణ భారత చిత్రం అవుతుంది.
ప్రభాస్ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ‘ది రాజా సాబ్’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ‘ఫౌజీ’ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుది. ఈ ఏడాది నవంబర్‌లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే ‘స్పిరిట్’ షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ ‘కల్కి 2898 AD’లో, ఆ తర్వాత ‘సలార్ 2’లోనూ ప్రభాస్ నటించాల్సి ఉంది.
“🚨 INSIDE REPORT: Abhishek Bachchan to join #Prabhas x Hanu Raghavapudi’s epic #Fauji 🎖️🔥
Talks are ON for an important role – if locked, this will be one MASSIVE crossover 💥#AbhishekBachchan #Bollywood #Tollywood” pic.twitter.com/eGVPpwbk0Q— TARAN ADARASH (@CritixPro999) September 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..