AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ తెరపైకి కృష్ణజింక వేట కేసు

జైపూర్ కృష్ణజింక కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసు విషయమై బాలీవుడ్ నటులు టబు, సోనాలి బింద్రే, సైఫ్ అలీ ఖాన్, దుష్యంత్ సింగ్, నీలమ్ కొఠారిలకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ హైకోర్టు సమన్లు జారీ చేసింది. 1998 అక్టోబర్‌లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో సల్మాన్‌ఖాన్‌తో కలిసి వీరంతా కృష్ణజింకలను వేటాడారని కేసు నమోదైంది.  ఈ కేసులో జోధ్‌పూర్ కోర్టు గతేడాది తీర్పును వెలువరిస్తూ సల్మాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. మిగతావారిని […]

మళ్లీ తెరపైకి కృష్ణజింక వేట కేసు
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 12, 2019 | 6:54 AM

Share

జైపూర్ కృష్ణజింక కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసు విషయమై బాలీవుడ్ నటులు టబు, సోనాలి బింద్రే, సైఫ్ అలీ ఖాన్, దుష్యంత్ సింగ్, నీలమ్ కొఠారిలకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ హైకోర్టు సమన్లు జారీ చేసింది. 1998 అక్టోబర్‌లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో సల్మాన్‌ఖాన్‌తో కలిసి వీరంతా కృష్ణజింకలను వేటాడారని కేసు నమోదైంది.  ఈ కేసులో జోధ్‌పూర్ కోర్టు గతేడాది తీర్పును వెలువరిస్తూ సల్మాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది.

మిగతావారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఈ కేసులో సల్మాన్‌ది ఎంత తప్పు ఉందో అతనితో పాటు ఉన్న వారిది కూడా అంతే తప్పు ఉందని భావిస్తూ జోధ్‌పూర్ హైకోర్టులో ఇటీవల ఓ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం సైఫ్ అలీ ఖాన్‌, టబు, సోనాలి బింద్రేలకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు కృష్ణజింకల కేసులో సల్మాన్‌కు శిక్ష పడగా రెండు రోజుల పాటు జోధ్‌పూర్ సెంట్రల్ జైళ్లో ఉండి.. ఆ తరువాత బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.

Follow Us