Tollywood: పేదరికంతో కబడ్డీకి దూరం కాకూడదని.. క్రీడాకారిణికి అండగా స్టార్ డైరెక్టర్.. భారీ ఆర్థిక సాయం

ప్రస్తుతం ఇంటర్‌ చదువుతోంది కార్తీక. తల్లిదండ్రులు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. అయినా పేదరికాన్ని అధిగమించి కబడ్డీలో సత్తా చాటుతోంది కార్తీక. కొద్దిరోజుల క్రితం బహ్రెయిన్‌లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్‌లో భారత్‌ మహిళల కబడ్డీ జట్టు స్వర్ణం దక్కించుకుంది. ఈ విజయంలో కార్తీకదే కీలక పాత్ర.

Tollywood: పేదరికంతో కబడ్డీకి దూరం కాకూడదని.. క్రీడాకారిణికి అండగా స్టార్ డైరెక్టర్.. భారీ ఆర్థిక సాయం
Mari Selvaraj

Updated on: Nov 02, 2025 | 11:00 AM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న ఓ పేద విద్యార్థినికి అండగా నిలిచారు. కబడ్డీలో సత్తా చాటుతోన్న కార్తీక అనే అమ్మాయికి రూ. 5లక్షల ఆర్థిక సాయం అందించాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన కార్తీక రీసెంట్‌గా బహ్రెయిన్‌లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్‌లో భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌పై భారత జట్టు ఘన విజయం సాధించింది. వైస్-కెప్టెన్‌ గా కార్తీక భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ఇప్పటికే భారత జట్టుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రూ. 2 లక్షల నజరానా ప్రకటించారు. కార్తీకపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, రీసెంట్ గా బైసన్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన మారి సెల్వరాజ్ కార్తీక ఇంటికి వెళ్లారు. ఆమెకు అభినందనలు తెలిపి రూ. లక్షల ఆర్థిక సాయం అందించారు. భవిష్యత్ లో కార్తీక మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

కార్తీక పేద కుటుంబంలో జన్మించింది. అమె తల్లిదండ్రులు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. అయినా అన్ని అడ్డంకులను అధిగమించి అటు చదువులోనూ, ఇటు కబడ్డీలోనూ సత్తా చాటుతోంది కార్తీక. ఈ నేపథ్యంలో ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్న కార్తీకకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేశారు డైరెక్టర్ మారి సెల్వరాజ్. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు బైసన్ డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కబడ్డీ ప్లేయర్ తో డైరెక్టర్ మారి సెల్వరాజ్..

కబడ్డీ నేపథ్యంలో బైసన్‌

కాగా కబడ్డీ నేపథ్యంలో మారి సెల్వరాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా బైసన్. చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ ఇందులో హీరోగా నటించాడు. అనుపమపరమేశ్వరన్‌, రజీషా విజయన్‌, పశుపతి, దర్శకుడు అమీర్‌, లాల్‌, మదన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ స్పోర్ట్స్ డ్రామాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.