Bigg Boss Telugu 9: ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు మద్దతుగా నాగ బాబు పోస్ట్.. కప్పు కొట్టేస్తాడా?

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ సీజన్ 9 ఆదివారం (సెప్టెంబర్ 07)న అట్టహాసంగా ప్రారంభమైంది. 9 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్ తో కలిపి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు.

Bigg Boss Telugu 9: ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు మద్దతుగా నాగ బాబు పోస్ట్.. కప్పు కొట్టేస్తాడా?
Actor Naga Babu

Updated on: Sep 08, 2025 | 7:17 PM

ముందు నుంచి ప్రచారం జరిగినట్లే గత సీజన్ల కంటే భిన్నంగా ఈసారి బిగ్ బాస్ 9 ప్రారంభమైంది. డబుల్ హౌస్, ఓనర్స్ వర్సెస్ టెనెంట్.. ఇలా ఈ సీజన్‌ లో చాలా కొత్త నియమాలు, నిబంధనలు ఉన్నాయి. అయితే కంటెస్టెంట్ల విషయంలో మాత్రం నిన్న మొన్నటిదాక సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన లిస్టులో ఉన్న వాళ్లే హౌస్‌లోకి అడుగు పెట్టారు. 9 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్ తో కలిపి మొత్తం 15 మంది ఈసారి హౌస్‌లోకి వెళ్లారు. ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, తనూజ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, భరణి, శ్రేష్ట వర్మ, సంజనా గల్రానీ, ఆశాశైనీలు సెలబ్రెటీ కంటెస్టెంట్స్‌గా కాగా.. మాస్క్‌ మెన్‌ హరీశ్‌, శ్రీజ, మర్యాద మనీష్‌, జవాన్‌ పవన్‌ కల్యాణ్‌, ప్రియా శెట్టి కామనర్స్ కోటాలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరంతా ముందు నుంచే తమ ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకునే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఎక్స్‌ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో తమ గురించి ప్రచారం చేసుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో ప్రారంభమైన కొద్ది సేపటికే మెగా బ్రదర్ నాగ బాబు ఒక కంటెస్టెంట్ కు మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అతను మరెవరో కాదు బిగ్ బాస్ హౌస్ లోకి ఏడో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన సీరియల్ నటుడు భరణి. ‘నాకు అత్యంత సన్నిహితుడైన భరణి శంకర్ బిగ్‌బాస్ 9 సీజన్‌లోకి అడుగుపెడుతున్న సందర్బంగా ఆయనకు నా శుభాకాంక్షలు. ఈ ప్రయాణం అతడికి విజయాన్ని, మంచి గుర్తింపుని తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అంటా నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు నాగ బాబు.

ఇవి కూడా చదవండి

నాగ బాబు పోస్ట్..

ఈ పోస్ట్‌కు భరణి కూడా రియాక్ట్ అయ్యాడు.. ‘మీ సపోర్ట్‌కు థాంక్స్ నాగబాబు సర్’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ఇద్దరి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెగాభిమానులు, జనసైనికుల్లో చాలా మంది భరణికి ‘ఆల్ ది బెస్ట్’ అంటూ విషెస్ చెబుతున్నారు. ఇక భరణి విషయానికొస్తే.. చిలసౌ స్రవంతి సీరియల్‌తో ఫేమస్‌ అయ్యాడు. ఆ తర్వాత బాహుబలి, ఆవిరి, ధీర, క్రేజీ అంకుల్స్‌ తదితర చిత్రాల్లో నటించాడు. అయితే గత కొంత కాలంగా కెమెరా ముందుకు రావడం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ 9 తో నటుడిగా మళ్లీ బిజీ కావాలని భరణి కోరుకుంటున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.