Bigg Boss 7 Telugu: నవ్వుతూనే ప్రశాంత్‌కు, అశ్వినికి ఇచ్చిపడేసిన నాగార్జున.. ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..

అమర్ కెప్టెన్ అవ్వడం కోసం శివాజీని ప్రతిమిలాడుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా నేడు జరగబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. శనివారం వచ్చిందంటే చాలు కింగ్ నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి హౌస్ మేట్స్ కు నవ్వుతూనే క్లాస్ తీసుకుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ప్రోమోలోనూ అదే చూపించారు.

Bigg Boss 7 Telugu: నవ్వుతూనే ప్రశాంత్‌కు, అశ్వినికి ఇచ్చిపడేసిన నాగార్జున.. ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..
Bigg Boss 7

Updated on: Nov 25, 2023 | 5:43 PM

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారాం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అని అందరు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. హౌస్ లో లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ లు కూడా అయిపోయాయి. అయితే ఈవారం కెప్టెన్ ఎవరు అన్నది మాత్రం ఇంతవరకు చెప్పలేదు. అమర్ కెప్టెన్ అవ్వడం కోసం శివాజీని ప్రతిమిలాడుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా నేడు జరగబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. శనివారం వచ్చిందంటే చాలు కింగ్ నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి హౌస్ మేట్స్ కు నవ్వుతూనే క్లాస్ తీసుకుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ప్రోమోలోనూ అదే చూపించారు.

ముందుగా కింగ్ నాగార్జున ప్రశాంత్ ను లేపారు. ప్రశాంత్ మర్డర్ అయ్యావు.. దెయ్యం అయ్యావు.. ఆ బూతులు ఏడుకు మాట్లాడావ్ అని అడిగారు నాగ్. దానికి ప్రశాంత్ బిత్తరపోయి సైలెంట్ గా నిలబడి చూస్తూ ఉండిపోయాడు. దానికి నాగార్జున నవ్వుతూనే మాట్లాడు ప్రశాంత్ .. నామినేషన్స్ లో మాట్లాడుతావ్ గా అంటూ ప్రశాంత్ ను ఇమిటేట్ చేశారు. దాంతో ఎదో తెలియక మాట్లాడును అని ప్రశాంత్ సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు. కానీ నాగ్ మాత్రం బూతులు ఎవ్వరూ కావాలని మాట్లాడారు ప్రశాంత్ అంటూ సీరియస్ అయ్యాడు.

ఆతర్వాత అశ్విని, గౌతమ్ లను లేపాడు నాగార్జున. అశ్విని గురించి మాట్లాడుతూ.. ఈ వారం సింగిల్ ఎలిమినేషనా..? డబుల్ ఎలిమినేషనా..? అని ప్రశ్నించాడు. తెలిసి కూడా సెల్ఫ్ నామినేషన్ చూసుకున్నావా.? అని ప్రశ్నించాడు నాగార్జున. కానిఫిడెన్సా ..? ఓవర్ కానిఫిడెన్సా.?మనం చేసే పొరపాట్లవల్లే మనం బలైపోతాం అని అన్నారు నాగార్జున. దాంతో ఈ వారం హౌస్ నుంచి అశ్విని ఎలిమినేట్ అవుతుండనై అర్ధమవుతుంది.

బిగ్ బాస్ 7 తెలుగు ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.