Kannappa : మంచు విష్ణు కన్నప్ప సినిమాలో కీలక పాత్రలో మెగాస్టార్ చిరంజీవి..!
మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ లాంటి భారీ తారాగణంతో రూపొందుతోంది కన్నప్ప. మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయింది. భారీ శివలింగానికి విల్లుని ఎక్కుపెట్టిన కన్నప్ప లుక్, చుట్టూ అందమైన ప్రకృతితో ఆకట్టుకుంటోంది పోస్టర్. న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లోనే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేయాలన్నది మంచు విష్ణు ప్లాన్.

మంచు విష్ణు కెరీర్‌లో కన్నప్ప ఎలాంటి సినిమా అవుతుంది? ఆయన ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్న హిట్ అందిస్తుందా? పాత భక్త కన్నప్పను మించేలా ఉంటుందా? రోజురోజుకీ పెరుగుతున్న హైప్ కన్నప్పను ఎటు తీసుకెళ్తుంది? అసలు విషయం ఏంటంటే.. మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ లాంటి భారీ తారాగణంతో రూపొందుతోంది కన్నప్ప. మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయింది. భారీ శివలింగానికి విల్లుని ఎక్కుపెట్టిన కన్నప్ప లుక్, చుట్టూ అందమైన ప్రకృతితో ఆకట్టుకుంటోంది పోస్టర్. న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లోనే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేయాలన్నది మంచు విష్ణు ప్లాన్.
కన్నప్ప సినిమా కోసం మా ప్రాణాలను పణంగా పెడుతున్నాం. ఇంతకు మునుపెన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ఆడియన్స్ కి ఇస్తాం అని అంటున్నారు మంచు విష్ణు. ఇంత కష్టపడి చేస్తున్న ఈ చిత్రం పాత కన్నప్పను మరిపిస్తుందా? దాన్ని దాటేలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? మంచు విష్ణు రెండు దశాబ్దాల కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందా? వీటన్నటికీ ఆన్సర్ రావాలంటే విజువల్ వండర్ కన్నప్ప రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే
కన్నప్ప సినిమాలో పరమశివుడి పాత్రలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ టాక్ సినిమా పై అంచనాలు పెంచేసింది. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార పార్వతీదేవిగా కనిపించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో చాలామంది స్టార్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో కీలక పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. కన్నప్ప సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. మోహన్ బాబుకు చిరంజీవి మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. ఈ స్నేహంతో చిరు ఇప్పుడు కన్నప్ప సినిమాలో చిన్న పాత్రలో కనిపించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Step into the world of 𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚 where the journey of an atheist Warrior to becoming Lord Shiva’s ultimate devotee comes to life🏹@kannappamovie @24framesfactory @avaentofficial@ivishnumanchu @themohanbabu @Mohanlal @NimmaShivanna #Prabhas#Kannappa🏹 #HarHarMahadevॐ pic.twitter.com/kRbebbZdbH
— Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
