AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: రచ్చ రచ్చగా నామినేషన్స్.. అమర్ దెబ్బకు ఏడ్చేసిన ప్రశాంత్..

సోమవారం నాడు నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఎప్పటిలానే నామినేషన్స్ గరం గరంగా జరిగాయి. ఈసారి హౌస్‌లో చాలా మంది శివాజీని టార్గెట్ చేశారు. నామినేషన్స్ లో ఒకొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలనీ చెప్పాడు. దాంతో హౌస్ మేట్స్ అంతా ఈసారి శివాజీని టార్గెట్ చేసి నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. సరైన రీజన్ చెప్పి పేయింట్ ను ముఖానికి పూయాలని చెప్పాడు బిగ్ బాస్. దాంతో ముందుగా ప్రియాంక శివాజీ పేరు చెప్పింది . ఆతర్వాత అర్జున్ కూడా శివాజీ పేరు చెప్పి ఆయన ముఖానికి రంగు పూశాడు.

Bigg Boss 7 Telugu: రచ్చ రచ్చగా నామినేషన్స్.. అమర్ దెబ్బకు ఏడ్చేసిన ప్రశాంత్..
Bigg Boss Telugu 7
Rajeev Rayala
|

Updated on: Nov 27, 2023 | 4:36 PM

Share

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. గతవారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో హౌస్ నుంచి అశ్విని, రతికా హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిది మంది హౌస్ మేట్స్ ఉన్నారు. ఇక సోమవారం నాడు నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఎప్పటిలానే నామినేషన్స్ గరం గరంగా జరిగాయి. ఈసారి హౌస్‌లో చాలా మంది శివాజీని టార్గెట్ చేశారు. నామినేషన్స్ లో ఒకొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలనీ చెప్పాడు. దాంతో హౌస్ మేట్స్ అంతా ఈసారి శివాజీని టార్గెట్ చేసి నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. సరైన రీజన్ చెప్పి పేయింట్ ను ముఖానికి పూయాలని చెప్పాడు బిగ్ బాస్. దాంతో ముందుగా ప్రియాంక శివాజీ పేరు చెప్పింది . ఆతర్వాత అర్జున్ కూడా శివాజీ పేరు చెప్పి ఆయన ముఖానికి రంగు పూశాడు. అలాగే గౌతమ్ కూడా శివాజీని నామినేట్ చేసి మీతో నాకు కొన్ని ప్రొబ్లెమ్స్ ఉన్నాయ్ అన్న అని చెప్పాడు. ఆలాగే పప్రియాంకా కూడా నేను గేమ్ ఆడిన టైం లో చాలా సార్లు నన్ను ప్రోత్సహించారు. అలాగే నాపై చాలా నెగిటివిటీ కూడా పెట్టుకున్నారు అని చెప్పింది.

అలాగే అర్జున్ మాట్లాడుతూ.. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది నాగ్ సార్ నోటి నుంచి వచ్చేసింది అని చెప్పాడు.  దానికి శివాజీ గట్టిగానే యాత్ర అయ్యాడు. తాజాగా బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబందించిన సెకండ్ ప్రోమోను రిలీజ్ చేశారు బిగ్ బాస్. ఈ ప్రోమోలో ముందుగా శోభా శెట్టి యావర్ ను నామినేట్ చేసింది. తన గురించి తప్పుగా రాశాడు అంటూ రీజన్ చెప్పింది. దానికి నువ్వు చూడకుండా ఎలా నామినేట్ చేస్తావ్ అంటూ యావర్ డిఫైన్ చేసుకున్నాడు. ఆతర్వాత అమర్ దీప్ ప్రశాంత్ ను నామినేట్ చేయాలనీ అనుకున్నాడు. ప్రశాంత్ ఏడవడంతో సరే నేను నామినేట్ చేయను లే ఏడవకు అని అన్నాడు. దానికి నువ్వు చేస్తున్నందుకు కాదు. నిన్ను నమ్మినందుకు నాకు బాధగా ఉంది అని అన్నాడు ప్రశాంత్.

నువ్వు నమ్మక ద్రోహం అనే మాట మాట్లాడితే నాకన్నా మూర్కుడు ఉండదు అని అమర్ గట్టిగా అరిచి చెప్పాడు. వెళ్లి కూర్చో అని అమర్ చెప్పినా కూడా ప్రశాంత్ వినలేదు.. ఆతర్వాత శివాజీ గౌతమ్ ను నామినేట్ చేశాడు. దానికి ప్రశాంత్ ను రైతు బిడ్డ అని సపోర్ట్ చేశారు అంటూ నోరు జారాడు గౌతమ్.. దాంతో ప్రశాంత్ లేచి ఎదో చెప్పబోయాడు. దానికి శివాజీ ప్రశాంత్ రైతు బిడ్డ అని .. యావర్ ఇంకోదో అని నేను సపోర్ట్ చేయలేదు అని డిఫైన్ చేసుకున్నాడు. మరి స్పై అని ఎందుకు వచ్చింది అని గౌతమ్ అడిగాడు. ఆతర్వాత అమర్ కూడా గౌతమ్ ను నామినేట్ చేశాడు. తనకు సపోర్ట్ చేస్తానని చేయకపోవడంతో అమర్ గౌతమ్ ను నామినేట్ చేశాడు. దీనికే నామినేషన్ వేస్తావరా.? అని ప్రశ్నించాడు గౌతమ్. ఆతర్వాత గౌతమ్, శివాజీ మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్ కావాలనే క్రియేట్ చేస్తున్నావ్ అని శివాజీ.. మేరె క్రియేట్ చేస్తున్నారు అని గౌతమ్ వాదులాడుకున్నారు. ఆతర్వాత పల్లవి ప్రశాంత్ కు శోభా శెట్టికి మధ్య గొడవ జరిగింది. తాను నామినేట్ చేస్తా అన్నా.. ప్రశాంత్ నేను డిఫైన్ చేసుకుంటా అంటూ ఆమెను ఆపే ప్రయత్నం చేశాడు. ఈ రోజు ఎపిసోడ్ మరింతవాడి వేడిగా ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.