Jr. NTR: వెంకటేష్ సినిమాలో ఎన్టీఆర్.. అంతే కాదు ఇద్దరు కలిసి డాన్స్ కూడా..
ఇప్పటికే వెంకటేష్ స్టార్ హీరోలందరితో పాటు కుర్ర హీరోలతోనూ కలిసి నటించారు వెంకటేష్. ముఖ్యంగా మహేష్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాలలాంటి సినిమాలు చేశారు వెంకటేష్. అలాగే ఇతర భాషలు సినిమాలను కూడా రీమేక్ కూడా చేసి ఆకట్టుకుంటున్నారు వెంకటేష్. ఇదిలా ఉంటే వెంకటేష్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించిన సినిమా ఎదో తెలుసా..

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో సినిమాలో మరో హీరో నటించడం చాలా కామన్. ఇప్పటికే చాలా మంది హీరోల సినిమాల్లో స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. స్టార్ హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోలోగా సినిమాలు చేస్తూనే మరోవైపు మల్టీస్టారర్ సినిమాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్ స్టార్ హీరోలందరితో పాటు కుర్ర హీరోలతోనూ కలిసి నటించారు వెంకటేష్. ముఖ్యంగా మహేష్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాలలాంటి సినిమాలు చేశారు వెంకటేష్. అలాగే ఇతర భాషలు సినిమాలను కూడా రీమేక్ కూడా చేసి ఆకట్టుకుంటున్నారు వెంకటేష్. ఇదిలా ఉంటే వెంకటేష్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించిన సినిమా ఎదో తెలుసా.. కనిపించడమే కాదు వెంకటేష్ తో కలిసి ఎన్టీఆర్ స్టెప్పులు కూడా వేశారు. ఆ సినిమా ఎదో మీకు తెలుసా.?
వెంకటేష్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ కలిసి స్టెప్పులు వేసిన సినిమా ఎదో తెలుసా..? ఆ సినిమానే చింతకాయల రవి. యోగి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2008లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా అనుష్క నటించింది. అలాగే మమతామోహన్ దాస్ సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది.
ఈ సినిమాలో ఒక సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారు. షాబా షాబా భల్లే భల్లే అనే సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారు అలాగే వెంకటేష్ తో కలిసి స్టెప్పులేశారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎంట్రీతో థియేటర్స్ లో ఆడియన్స్ విజిల్స్ తో సందడి చేశారు. ఇక ఈ ఇద్దరి కాంబోలో ఓ మల్టీ స్టారర్ సినిమా రావాలని అభిమానులు ఆశపడ్డారు కానీ అది ఇప్పటివరకు జరగలేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. అలాగే వెంకటేష్ శైలేష్ దర్శకత్వంలో సైంధవ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

చింతకాయల రవి మూవీ సాంగ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.