AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vichithra: ఆ హీరో నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. వెళ్లలేదని నరకం చూపించాడు.. నటి సంచలన కామెంట్స్

చాలా మంది హీరోయిన్స్ తమ కెరీర్ స్టార్టింగ్ ఎదురైనా చేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా తమిళ నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సీనియర్ నటి విచిత్ర తమిళ్ తో పాటు కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె తమిళ్ బిగ్ బాస్ లో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె తన కెరీర్ బిగినింగ్ లో ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి తెలిపారు.

Vichithra: ఆ హీరో నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. వెళ్లలేదని నరకం చూపించాడు.. నటి సంచలన కామెంట్స్
Actress Vichithra
Rajeev Rayala
|

Updated on: Nov 23, 2023 | 11:53 AM

Share

మొన్నామధ్య ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. చాలా మంది తాము లైంగిక వేధింపులకు గురయ్యాము అని చెప్పి షాక్ ఇచ్చారు. చాలా మంది హీరోయిన్స్ తమ కెరీర్ స్టార్టింగ్ ఎదురైనా చేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా తమిళ నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సీనియర్ నటి విచిత్ర తమిళ్ తో పాటు కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె తమిళ్ బిగ్ బాస్ లో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె తన కెరీర్ బిగినింగ్ లో ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి తెలిపారు. విచిత్ర మాట్లాడుతూ..

2001 సమయంలో నేను త్రీ స్టార్ హోటల్‌లో పెద్ద స్టార్ హీరోని కలిశాను.. అతను నా రూమ్‌కి రా అని అన్నాడు అని చెప్పి షాక్ ఇచ్చింది. ఒక పెద్ద హీరో ఇలా అన్నాడేంటని ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఒక స్టార్ హీరో నన్ను రూమ్ కు రమ్మన్నాడు. కానీ నేను కుదరదు అని చెప్పి ఆ రోజు రాత్రి నా రూమ్‌కి వెళ్లి నేను పడుకున్నాను.. కానీ నెక్ట్స్ రోజురాత్రి నుంచి నాకు నరకాన్ని చూపించారు అని తెలిపింది విచిత్ర

అయితే అలాంటి ఘటన నాకు ఎప్పుడూ కూడా తమిళ సినిమా సెట్లలో జరగలేదు.. ఆ సినిమా కోసం పని చేసే వ్యక్తి ఒకడు ప్రతీ రోజూ నా రూమ్ డోర్ కొట్టేవాడు.. నా రూమ్‌కి ఫోన్లు వచ్చేవి..ఇదంతా గమనించిన హోటల్ మేనేజర్ నాకు సాయం చేశాడు. సినిమా టీంకు తెలియకుండా రూం మార్చేవారు.. అది తెలియక రోజూ వచ్చిడోర్ కొట్టేవారు అని తెలిపింది. అలాగే ఒక రోజు సెట్‌లో ఓ వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. బై మిస్టేక్ అలా చేస్తున్నాడేమో అని వదిలేశాను మళ్లీ రెండో టేక్‌లోనూ అలానే చేశాడు. అలాగే యాక్షన్ కొరియోగ్రాఫర్‌కు కంప్లైంట్ చేశా.. అందరి ముందు ఆ స్టంట్ మెన్ నన్ను చెంప మీద కొట్టాడు. ఆ టైంలో సెట్‌లో ఏ ఒక్కరూ నాకోసం ముందుకు రాలేదు. తప్పు అని చెప్పలేదు.. మాట్లాడలేదు.. ఆ రోజు ఎంతో బాధ, కోపం, కసి నాలో కలిగింది. అమ్మానాన్నలకు చెప్పలేదు.. కానీ మా ఫ్రెండ్స్‌కి ఆ విషయం చెప్పాను. దాంతో వారు యూనియన్‌కు కంప్లైంట్ చేయమని సలహా ఇచ్చారు.. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను.. లాయర్‌ని కలిశాను. అప్పడే నా కెరీర్ ముగిసిందని నాకు అర్థమైంది.. అన్నీ మరిచిపో అని యూనియన్ కూడా చెప్పింది.. ఇలాంటి ప్లేస్‌లో పని చేయాలా.? నీకు గౌరవం దక్కని చోట పని చేయడం ఎందుకు అని నా భర్త అన్నారు’ అని ఎమోషనల్ అయ్యారు విచిత్ర. ఆమె కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ హీరో అలా అన్నాడు? ఏ సినిమా సెట్‌లో ఇది జరిగింది? అంటూ సోషల్ మీడియా లో ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.