AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Season 7: ఎట్టకేలకు గెలిచిన రైతు బిడ్డ.. బీబీ7 నాలుగవ కన్ఫర్డ్మ్‌ సభ్యుడిగా కామన్ మ్యాన్.. షాకైన హౌస్‌మేట్స్

ప్రతీ బీబీ ఎపిసోడ్‌లో ఎవరో ఒకరు హీరోగా మారుతుంటారు. తనకిచ్చిన టాస్క్‌లో విన్నర్‌గా మారి.. హౌస్‌లో అందర్నీ షాక్‌కి గురిచేస్తుంటారు. అండర్‌ డాగ్.. ఫేక్.. డబుల్ గేమ్‌.. సేఫ్‌ గేమ్‌.. అంతా యాక్టింగ్ అంటూ.. విమర్శంచిన వారినే నోరెళ్ల బెట్టేలా.. చేస్తుంటారు. ఇమ్యూనిటీని పొందుతారు. పక్కాగా హౌస్‌లో కనీసం రెండు మూడు వారాలైనా బజ్‌ చేసేంత స్కోప్‌ సంపాదించుకుంటారు. ఇక ప్రజెంట్ ఎపిసోడ్లో ఎగ్జాక్లీ అదే చేశాడు.. రైతు బిడ్డ ప్రశాంత్.

Bigg Boss Season 7: ఎట్టకేలకు గెలిచిన రైతు బిడ్డ.. బీబీ7 నాలుగవ కన్ఫర్డ్మ్‌ సభ్యుడిగా కామన్ మ్యాన్.. షాకైన హౌస్‌మేట్స్
Bigg Boss Season 7 Highlights
Venkata Chari
| Edited By: Rajeev Rayala|

Updated on: Sep 30, 2023 | 7:05 AM

Share

Bigg Boss Season 7: ముందు ప్రశాంత్ గురించి చెప్పిన ఉపోద్ఘాతం పక్కకు పెడితే.. షో బిగినించి ఏం జరిగిందంటే…. నిన్నటి 26th ఎపిసోడ్‌లో కంటిన్యూ అయిన గానా టాస్క్‌తోనే.. ఇవ్వాళ అంటే 27th ఎపిసోడ్‌ కూడా స్టార్ట్ అయింది. వికృత గెటప్స్‌తో.. బీబీ హౌస్‌లోని కంటెట్స్‌ యాక్టివిటీ రూమ్‌లో చేసే అతి.. ఇవ్వాళ కూడా అందర్నీ ఇరిటేట్ చేసింది. రోటీ రాణీగా.. సుబ్బుతో రీ స్టార్ట్ అయిన గానా ఈవెంట్.. ఆ తరువాత జీ మ్యాన్ అంటూ.. వచ్చిన గౌతమ్‌తో చాలా ప్లాట్‌గా సాగుతుంది. అమ్మూ అంటూ.. బైలింగువల్ గెటప్‌లో వచ్చిన అమర్‌ పర్ఫార్మెన్స్‌తో.. అదే ఫ్లాట్‌ నెస్‌ను కంటిన్యూ చేస్తూ.. భల్లే భల్లే రతిక దగ్గరకు వస్తుంది. ఆమె పర్ఫర్మెన్స్‌ కూడా.. మరింత ఫ్లాట్‌గా సాగుతూ.. ఈ టాస్క్‌ ముగుస్తుంది.

ఇక ఆ వెంటనే రంగంలోకి దిగిన బిగ్ బాస్.. ఇప్పటికే కన్ఫర్మ్డ్‌ కంటెస్టెంట్స్ అయిన శివాజీ, సందీప్, శోభని.. సడెన్‌గా జడ్జెస్‌లా మారుస్తాడు. ఇప్పటి వరకు పర్ఫార్మెన్స్‌ చేసిన కంటెస్టెంట్స్ అందర్లో ఒకరిని నాలుగో పవరాస్త్ర కంటెండర్‌గా ఎన్నుకోవాలని ఆదేశిస్తాడు. దీంతో ఈ ముగ్గురు నాలుగో పవరాస్త్ర కంటెండర్గా సుబ్బును ఎన్నుకుంటారు. ఇక ఈ ముగ్గురు తీసుకున్న నిర్ణయంతో అప్‌సెట్ అయిన అమర్‌.. శివాజీ సీరియస్ అవుతాడు. కావాలనే తనను కార్నర్‌ చేస్తున్నారని ఆరోపిస్తాడు.

ఇక ఆ తరువాత గుడ్ డే మూమెంట్ టాస్క్‌లో భాగంగా…. కంటెస్టెంట్స్ లైఫ్‌లో గుడ్‌ డే మూమెంట్ ఏంటో చెప్పాలని ఆదేశిస్తారు. ఇక బిగ్ బాస్ ఆదేశాల ప్రకారమే ఈ టాస్క్‌లో కంటెస్టెంట్స్ అందరూ వారి వారి గుడ్ డే మూమెంట్స్‌తో .. అందరితో షేర్ చేసుకుంటారు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ తరువాత సీన్లో .. ప్రిన్స్ యావర్ తన కష్టాల గురించి చెబుతుంటే.. శోభ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది. బిగ్ బాస్ హౌస్‌లో తనను గెలవాలని బలంగా కోరుకుంటూ.. ప్రిన్స్‌కు చెబుతుంది.

ఇక తరువాత నాలుగో పవరాస్త్ర కోసం టాస్క్‌ స్టార్ట్ చేసిన బిగ్ బాస్.. పవరాస్త్ర రింగును.. ప్రిన్స్, ప్రశాంత్, సుబ్బు ముగ్గురూ కలిసి ఒంటి చేత్తో పట్టుకోవాలని.. చెబుతాడు. ఎవరు వదలకుండా.. ఒక్కవ సేపు పట్టుకుంటారో వారే విన్నర్ అంటూ.. అనౌన్స్ చేస్తారు. అయితే పవరాస్త్ర రింగును పట్టుకున్న కంటెస్టెంట్స్.. హౌస్‌లో ఎటువైపైనా తిరగొచ్చని.. మిగిలిన కంటెస్టెంట్స్ కూడా.. వాళ్లను టచ్ చేయకుండా డిస్ట్రబ్ చేయొచ్చని ఆదేశిస్తాడు. అయితే ఎంత టైం అయినా ఎవరూ పవరాస్త్రను వదలకపోవడంతో.. మళ్లీ బిగ్ బాస్ నయా రూల్‌తో ముందుకు వస్తాడు. హౌస్‌ మేట్స్ ఒకరికొకరు కన్విన్స్ చేసుకుని అస్త్రను వదిలిపెట్టొచ్చని.. చెబుతాడు. దీంతో ముగ్గురు ఒకరినొకరు కన్విన్స్ చేసుకోడానికి.. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

కానీ, చివరి వరకు ఎవరూ అస్త్రాన్ని వదలక పోవడంతో.. ఈ టాస్క్‌ను రద్దు చేసి.. మరో టాస్క్ ఇస్తా అంటూ.. అనౌన్స్ చేస్తాడు బిగ్ బాస్.

చెప్పినట్టుగానే.. ‘కదలకు రా.. వదలకు రా’ అనే టాస్క్‌తో.. కంటెండర్స్ ముందుకు వస్తాడు బిగ్ బాస్. కంటెండర్స్ అందర్నీ వారికి కేటాయించిన స్టాండ్‌ పై వారి పవరాస్త్రను బ్యాలెన్స్ చేయాలని చెబుతాడు. అయితే ఈ టాస్క్‌లో.. ప్రశాంత్ ప్రిన్స్ యావర్‌, సుబ్బు కంటే.. ఎక్కువ సేపు బ్యాలెన్స్ చేసి.. నాలుగో పవరాస్త్రను రైతు బిడ్డ గెలుచుకుంటాడు. అంటే.. నాలుగో కన్ఫర్మ్డ్‌ బీబీ క్యాండెట్‌గా కామన్‌ మ్యాగ్ గా ట్యాగ్ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ ఎన్నికవుతాడు. బీబీ ఆడియెన్స్‌.. చప్పట్లు కొట్టేలా చేసుకుంటాడు. కానీ ఎపిసోడ్‌ చివర్లో … శివాజీ కాళ్లు మొక్కి.. శివాజీ ప్రవచనాలు వింటూ కనిపించి.. ఇంకా ఆయన ఇన్‌ఫ్లూయెన్స్‌లో ప్రశాంత్‌ ఏమైపోతాడో.. అనౌ డౌట్ అందర్లో కలిగిస్తాడు.

– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని బిగ్‌బాస్‌-7 కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి