Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Season 7: అయ్యయ్యో.. మనోడి కష్టం బూడిదలో పోసిన పన్నీరైందే..

శివాజీ ప్రిన్స్ ను, యావర్ స్టాండ్ తీసుకుంటూ హౌస్ లో మిగిలిన వారితో గొడవలు పెట్టుకుంటున్నాడు. నిజానికి శివాజీ చేస్తుంది కరెక్ట్ కాదు అని చూస్తున్న ప్రేక్షకులకు కూడా అర్ధమవుతుంది. కానీ నేను న్యాయం వైపే ఉంటాను కథలు మాత్రం బాగానే చెప్తున్నాడు. మొన్నటి కిచన్ డ్రామాకు కూడా శివాజీనే కారణం, బజర్ దగ్గర కూర్చొని తినడం కరెక్ట్ కాదు అంటూ సందీప్ అనడంతో శివాజీ ప్రిన్స్ కు సపోర్ట్ గా మాట్లాడాడు. దాంతో హౌస్ లో ఉన్నవారందరూ శివాజీ పై సీరియస్ అయ్యారు. ముఖ్యంగా శోభా శెట్టి కి శివాజీ మధ్య గట్టిగానే వాదన జరిగింది. 

Bigg Boss Season 7: అయ్యయ్యో.. మనోడి కష్టం బూడిదలో పోసిన పన్నీరైందే..
Bigg Boss 7 Telugu
Follow us
Rajeev Rayala

| Edited By: Basha Shek

Updated on: Sep 30, 2023 | 9:37 AM

బిగ్ బాస్ హౌస్ లో అసలు ఏం జరుగుతోంది. ఎవరి గేమ్ వాళ్లు ఆడకుండా.. పక్కన వాళ్ల సలహాలు తీసుకుంటూ వాళ్లు చెప్పినట్టు ఆడుతున్నారు. ముఖ్యంగా హౌస్ లో రెండు టీమ్స్ గా డివైడ్ అయ్యారు. సీరియల్ బ్యాచ్ ఒక వైపు, శుభ శ్రీ, ప్రిన్స్, ప్రశాంత్, శివాజీ ఒక టీమ్ అయ్యారు. దాంతో శివాజీ ప్రిన్స్ ను, యావర్ స్టాండ్ తీసుకుంటూ హౌస్ లో మిగిలిన వారితో గొడవలు పెట్టుకుంటున్నాడు. నిజానికి శివాజీ చేస్తుంది కరెక్ట్ కాదు అని చూస్తున్న ప్రేక్షకులకు కూడా అర్ధమవుతుంది. కానీ నేను న్యాయం వైపే ఉంటాను కథలు మాత్రం బాగానే చెప్తున్నాడు. మొన్నటి కిచన్ డ్రామాకు కూడా శివాజీనే కారణం, బజర్ దగ్గర కూర్చొని తినడం కరెక్ట్ కాదు అంటూ సందీప్ అనడంతో శివాజీ ప్రిన్స్ కు సపోర్ట్ గా మాట్లాడాడు. దాంతో హౌస్ లో ఉన్నవారందరూ శివాజీ పై సీరియస్ అయ్యారు. ముఖ్యంగా శోభా శెట్టి కి శివాజీ మధ్య గట్టిగానే వాదన జరిగింది.

ఇక నిన్నటి టాస్క్ లో నాలుగో పవర్ అస్త్ర సాధించడానికి కంటెండర్ కోసం ఒక వెరైటీ ఈవెంట్ చేశాడు బిగ్ బాస్. బిగ్ బాస్ గలా ఈవెంట్ పేరుతో హౌస్ లో ఉన్న వారు ఒకొక్కరు ఒకొక్కలా విభిన్నంగా, విచిత్రంగా డ్రసింగ్ చేసుకోవాలని . ఎవరిదీ విందాత్మకంగా ఉంటే వారు నాలుగో కంటెండర్ గా ఎంపిక అవుతారని చెప్పాడు బిగ్ బాస్.

దాంతో పాపం అమర్ దీప్ సగం మీసం, సగం గడ్డం తీసేసి. సగం అమ్మాయి, సగం అబ్బాయిగా మారాడు. చాల డిఫరెంట్ గా ఆలోచింది అమర్ ఇలా తయారయ్యాడు. అంతకు ముందు గుండు చేయించుకోమంటేనే నో చెప్పిన అమర్ ఇప్పుడు దేనికైనా రెడీ అంటూ ఇంకా సగం సగం రెడీ అయ్యాడు. అయితే ఈ ఈవెంట్ లో జడ్జ్ లు మాత్రం శుభ శ్రీ ని విన్నర్ గా అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా తానే విన్ అవుతా అనుకున్న అమర్ పాపం విన్ కాకపోవడమతొ ఆవేశంతో ఊగిపోయాడు. ఇంత క్రియేటివ్ గా ఆలోచించి డ్రస్ చేసుకున్నా కూడా కావలెను సుబ్బు కు ఇచ్చారని అరిచాడు. మీకు కొంతమందికి మాత్రమే ఫెవర్ గా ఉంటున్నారు అంటూ వాదన చేశాడు. కానీ నిజంగా అందరూ అమర్ దీప్ విన్ అవుతాడు అని అనుకున్నారు కానీ మనోడి ప్రయత్నం బూడిదల పోసిన పన్నీరైంది.

మరిన్ని బిగ్‌బాస్‌-7 కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి