AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RDX OTT: తెలుగులోకి వచ్చేసిన మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. ‘ఆర్‌డీఎక్స్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ప్రస్తుతం ఓటీటీలో మలయాళ సినిమాలకు క్రేజ్‌ బాగా పెరుగుతోంది. సహజత్వానికి, ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసే ఈ సినిమాలకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అందుకే ఓటీటీ సంస్థలు తమ సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసి విడుదల చేస్తున్నాయి. అలాగే గతంలో థియేటర్లలో రిలీజై సూపర్‌హిట్‌గా నిలిచిన సినిమాలను కూడా తెలుగు వెర్షన్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. ఇటీవల విడుదలైన 2018, పద్మిని, జర్నీ ఆఫ్‌ 18 ప్లస్‌ లవ్‌ సినిమాలకు..

RDX OTT: తెలుగులోకి  వచ్చేసిన మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. 'ఆర్‌డీఎక్స్‌' స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
RDX Movie
Basha Shek
|

Updated on: Sep 30, 2023 | 7:15 AM

Share

ప్రస్తుతం ఓటీటీలో మలయాళ సినిమాలకు క్రేజ్‌ బాగా పెరుగుతోంది. సహజత్వానికి, ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసే ఈ సినిమాలకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అందుకే ఓటీటీ సంస్థలు తమ సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసి విడుదల చేస్తున్నాయి. అలాగే గతంలో థియేటర్లలో రిలీజై సూపర్‌హిట్‌గా నిలిచిన సినిమాలను కూడా తెలుగు వెర్షన్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. ఇటీవల విడుదలైన 2018, పద్మిని, జర్నీ ఆఫ్‌ 18 ప్లస్‌ లవ్‌ సినిమాలకు ఓటీటీలో సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అదే ఆర్‌డీఎక్స్‌: రాబర్ట్‌ డోనీ జేవియర్‌. ఓనం పండగ సందర్భంగా ఆగస్టు 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. సుమారు రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఒక్క కేరళలోనే రూ.40 కోట్ల మేర రాబట్టింది. అలాగే అన్ని భాషల్లోనూ కలిపి రూ. 85 కోట్లకు పైగా రాబట్టింది. ఈ హై వోల్టేజ్‌ యాక్షన్‌ డ్రామా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసింది. గతవారమే ఆర్‌డీఎక్స్‌ను స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తెచ్చింది. అయితే కేవలం మలయాళ భాషలోనే రిలీజ్‌ చేసింది. తాజాగా తెలుగుతో పాటు కన్నడ, తమిళ్‌, హిందీ భాషల్లోనూ ఆర్‌డీఎక్స్‌ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఆర్‌డీఎక్స్‌ సినిమాలో షేన్ నిగమ్, ఆంటోని వర్గీస్, నీరజ్ మాధవ్ కీలక పాత్రలు పోషించారు. మహిమా నంబియార్, ఐమా సెబాస్టియ్, లాల్, బాబు ఆంటోని, మాలా పార్వతి ఇతర పాత్రల్లో మెరిశారు. నహాస్ హిదాయత్ మొదటిసారి మెగాఫోన్‌ పట్టి ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. వీకెండ్‌ బ్లాక్‌ బస్టర్స్‌ బ్యానర్‌పై సోఫియా పాల్ ఆర్‌డీఎక్స్‌ సినిమాను నిర్మించారు. సి.ఎస్‌. శ్యామ్‌ స్వరాలు సమకూర్చారు. మరి ఈ వీకెండ్‌లో మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాను చూడాలంటే ఆర్‌డీఎక్స్‌ మంచి ఛాయిస్‌. ఉదయనిధి స్టాలిన్ వంటి ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం విశేషం.

నెట్ ఫ్లిక్స్ లో ఆర్ డీ ఎక్స్ స్ట్రీమింగ్..

హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆర్ డీ ఎక్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us