AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Season 7: ‘ఆపు నీ కథలు..’ రతికపై నోరు పారేసుకున్న రైతు బిడ్డ.. కోపంతో ఊగిపోయిన ప్రిన్స్

రితిక పెంకేషం..! అమర్ బూతు పురాణం..! దామిని ఏడుపు యవ్వారం..! గౌతమ్‌ కృష్ణ వీరావేశం! మధ్యలో శివాజీ చిలిపి తనం.. ! ఇలాగే.. వీళ్ల గోలతోనే.. కాస్త ఇంట్రెస్టింగ్‌గా.. మరి కాస్త ఇరిటేటెడ్‌గా సాగింది బిగ్ బాస్ సీజన్‌ 7 11thడే 12th ఎపిసోడ్. మరి ఇవ్వాళ్టి.. 12thడే 13thఎపిసోడ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే.. చదివేయండి

Bigg Boss Season 7: 'ఆపు నీ కథలు..' రతికపై నోరు పారేసుకున్న రైతు బిడ్డ.. కోపంతో ఊగిపోయిన ప్రిన్స్
Bigg Boss Season 7
Phani CH
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 16, 2023 | 8:35 AM

Share

రితిక పెంకేషం..! అమర్ బూతు పురాణం..! దామిని ఏడుపు యవ్వారం..! గౌతమ్‌ కృష్ణ వీరావేశం! మధ్యలో శివాజీ చిలిపి తనం.. ! ఇలాగే.. వీళ్ల గోలతోనే.. కాస్త ఇంట్రెస్టింగ్‌గా.. మరి కాస్త ఇరిటేటెడ్‌గా సాగింది బిగ్ బాస్ సీజన్‌ 7 11thడే 12th ఎపిసోడ్. మరి ఇవ్వాళ్టి.. 12thడే 13thఎపిసోడ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే.. చదివేయండి 👇👇

ఇక నిన్నటి పవరాస్త్రను పొందే టాస్క్‌ ఇవ్వాళ కూడా కంటిన్యూ అయింది. మహాబలి టీంలో ఉన్న గౌతమ్ కృష్ణ రణధీర్ టీంలోని యావర్ దగ్గర నుంచి మాయాస్త్రాన్ని తీసుకుని.. శివాజీకి ఇస్తాడు. శివాజీని ఎన్నుకోవడం టీం డెసీషన్‌ అని.. శివాజీ మైండ్‌ గేమ్‌.. బాగుందని.. రీజన్‌గా చెబుతాడు. దీంతో యావర్‌ నాన్ సెన్స్‌ రీజన్‌ అంటూ.. గౌతమ్ పై సీరియస్ అవుతాడు. బిగ్ బాస్ తనతో మాట్లాడే వరకు తాను తన దగ్గర ఉన్న అస్త్రాన్ని ఇవ్వను అంటూ.. మొండికేసి కూర్చున్నాడు. అయితే అమర్‌ యావర్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తుండగానే.. ఒక్కసారిగా ఏడ్చేస్తాడు. బ్యాడ్ గేం.. అంటూ.. తన చేతిలో ఉన్న అస్త్రాన్ని విసిరేస్తాడు. ‘బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్ ‘ నేను ఉండాలనుకోవడం లేదు అంటూ.. ఏడుస్తాడు. ఇంతలో బిగ్ బాస్ టాస్క్‌ ముగిసిందని.. పవరాస్త్రను పొందేందుకు మాయాస్త్ర భాగాలున్న శివాజీ, షకీలా.. ఫైనల్ టాస్క్ ఆడాల్సి ఉంటుందిని అనౌన్స్ చేశారు. ఇక ఈ అనౌన్స్మెంట్‌ ఉన్న విన్న యావర్‌ .. మరింతగా డిస్సపాయింట్ అయి.. తన చేతిలో ఉన్న పిల్లో విసిరేస్తాడు. ఐ వాంట్‌ టూ గో హోమ్ అంటూ.. లాగ్‌లో తిరుగుతూనే ఉంటాడు.

ఇక మరో పక్క రతిక మళ్లీ.. లొల్లి మొదలెట్టేస్తుంది. ప్రిన్స్‌, శివాజీ ఫైనల్ గేమ్‌లో ఉండాలనుకున్నా.. బలంగా కోరుకున్నా.. కానీ అలా కాకుండా.. షకీలా ఫైనల్ టాస్క్లో ఉంది. ప్రిన్స్ యావర్ కంటే షకీలా ఎలా డిస్వర్ అవుతుంది. అంటూ.. తన గొంతును పెద్దది చేస్తూ అరుస్తుంది. జెన్యూన్ గా ఆడాలి.. రాజకీయాలొద్దంటూ.. కంటెస్టెంట్స్ కు చెబుతుంది. కానీ రతిక మాటలకు అడ్డుపడిన రైతు బిడ్డ ప్రశాంత్ రతికతో మాటల దాడికి దిగుతాడు. రతిక మాటలన్నీ అబద్దాలు అంటూ.. గేమ్ అయిపోయాక చెప్పుడు కాదు… ముందు చెప్పాలని అరుస్తాడు. “వాళ్ల ముందు నువ్వు మంచిదానివి మేం ****” అంటూ.. ఆపు నీ కథలు అంటూ.. కామెంట్స్ చేస్తాడు.

ఇక వీళ్ల డిస్కషన్స్ జరుగుతుంటే.. మరో పక్క ప్రిన్స్ ఒక్క సారిగా సీరియస్ అవుతాడు. చెవులకు చిల్లులు పడేలా.. అరుస్తూ.. గౌతమ్‌ మీదకి వెళతాడు. గౌతమ్‌ కూడా గట్టిగానే రియాక్టవుతాడు. ఆల్మోస్ట్ ఇద్దరూ కొట్టుకుంటారా అనేంత దగ్గరగా నిలబడి ఒకరి మీద ఒకరు అరుచుకుంటారు. ఇక ఈ క్రమంలోనే గౌతమ్ తన చేతి వేళ్లతో ఓ సైన్ చూపించాడని.. తనను పర్సనల్‌గా ఇన్‌సల్ట్ చేశాడని.. ఐ వాజ్‌ జెస్టిస్‌ అంటూ.. గౌతమ్‌ మీద ఆరోపణలు చేస్తాడు. బిగ్ బాస్ ఈ ఇష్యూను సాల్వ్‌ చేసే వరకు.. తనకు న్యాయం చేసేవరకు.. మైకు వేసుకోను అంటూ.. మైక్‌ తీసేస్తాడు. అలా.. ఒక్కసారిగా బిగ్ బాస్‌ హీటెక్కేలా చేస్తాడు.

దీంతో బిగ్‌ బాస్ ప్రిన్స్‌ను పిలిచి ఏం అయిందని చెప్పగా.. ప్రిన్స్‌ గౌతమ్ తనను ఇంజెక్షన్ తీసుకున్నట్టు అవామానించారని.. అలా తాను ఎప్పుడూ చేయలేదని ఏడుస్తాడు. దానికి బిగ్ బాస్.. ఇది బిగ్ బాస్ అని.. అప్స్ అండ్ డౌన్స్ ఇక్కడ ఉంటాయని.. మీ గేమ్‌ డిస్ట్రక్ట్ చేయడానికి రిమెనింగ్ కంటెస్టెంట్స్ ఇలా చేస్తారని .. అవేమీ పట్టించుకోకుండా.. గేమ్ ఆడాలని.. మీ గేమ్, ఎఫర్ట్స్ ను బిగ్ బాస్ అండ్ బయట ఆడియెన్స్ చూస్తున్నారని చెప్పారు. కానీ గౌతమ్ నుంచి సారీ కావాలని.. ప్రిన్స్ బిగ్ బాస్‌ నుంచి కోరడంతో.. బిగ్ బాస్ నువ్వు గెలిచేందుకు వచ్చావని ముందు గేమ్ మీద ఫోకస్ చేయని సూచిస్తాడు. దీంతో ప్రిన్స్ సరే అంటూ.. వెళిపోతాడు.

ఇక మరో వైపు.. రతిక షకీలా దగ్గరికి వెళ్లి సారీ చెబుతుంది. ఓ హీటెడ్ డిస్కషన్‌లో.. మిమ్మల్ని అమ్మ అనలేదు సారీ అంటూ చెప్పింది. షకీలా కాళ్ల మీద పడుతుంది. షకీలా కూడా.. నాలుగు మంచి మాటలు క్షమిస్తున్నా అంటూ.. రతికను పంపిస్తుంది. అయితే ఈ క్రమంలో.. షకీలా.. సిగరెట్‌ నోళ్లో పెట్టుకుని ఉండడం.. కాస్త అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.

ఇక మరుసటి రోజు.. రంగస్థలం సాంగ్‌తో తమ డేను స్టార్ట్ చేసిన కంటెస్టెంట్స్.. బిగ్ బాస్ నుంచి తదుపరి టాస్కకు సంబంధించిన ఆదేశాలను అందుకుంటారు. రెండవ పవరాస్త్ర కోసం పోటీపదేందుకు ఒక పోటీదారున్ని ఎంచుకునే అవకాశం సందీప్‌ కి ఇచ్చిన బిగ్ బాస్.. తనను అడిగినప్పుడు ఆ ఒక్క కంటెస్టెంట్ పేరు చెప్పాలని సూచిస్తాడు.

ఇక బిగ్ బాస్ న్యూ టాస్క్‌ గురించి చెప్పడంతో.. ఓ పక్క సందీప్ ఎవరిని ఎంచుకోవాలని తేజుతో డిస్కస్ చేస్తుండగా… స్టార్ సింగర్ దామిని.. యావర్‌తో.. ఫన్ ప్లట్టింగ్ స్టార్ట్ చేస్తుంది. ‘యావర్‌.. ఐ గాట్ ఫీవర్‌. ఐ నీడ్‌ యువర్‌ కవర్…’ అని రైమింగ్‌లో డైలాగ్‌ విసరగా.. యావర్ ప్రిన్స్ ఐ వాంట్ షవర్‌ అంటూ.. రివర్స్ పంచ్‌ వేస్తాడు. అక్కడున్న వారందర్నీ నవ్వించేస్తాడు.

ఇక తరువాత సందీప్ తనకు పోటీదారునిగా.. అమర్‌ను ఎంచుకున్నట్టు అనౌన్స్ చేస్తాడు. కానీ సందీప్ రీజన్‌తో శివాజీ కాస్త అప్‌ సెట్ అవుతాడు. రాంగ్ అంటూ.. షకీలాతో చెబుతాడు. ఇక మరో పక్క సందీప్‌ అమర్‌తో..తనను ఎందుకు ఎంచుకున్నాడో చెబుతాడు. నీ బెస్ట్ నువ్వు ఇవ్వు అంటూ.. చెబుతాడు. ఇక ఓ అరగంట ముందు వరకు.. తన పవరాస్త్ర లాక్కున్నారని.. గౌతమ్ తనని అవమానించారని.. అరిచి గీపెట్టిన యావర్ ప్రిన్స్ తాజాగా మాత్రం.. తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను బయటికి తీస్తాడు. రతిక ఐ లైక్‌ యూ రా అంటూ చెబుతాడు. ఐ లైక్‌ టూ.. ఏమవుతుందని యావర్ అని రితిక అడగగా.. ప్రేమ బయట వస్తుంది అంటూ.. ఆన్సర్‌ ఇస్తాడు. సిగ్గొస్తుంది అంటూ.. సిగ్గుపడతాడు. బిగ్ బాస్ నేను రతికను లవ్‌ చేస్తున్నా.. ఇది నా కన్ఫెషన్ అంటూ.. నవ్వుతూ చెబుతాడు. ఆ తరువాత లవ్‌ గుర్తులు చూపిస్తూ.. తనను గాఢంగా ప్రేమిస్తున్నట్టు చేస్తాడు. ఈ సీన్లో ప్రిన్స్ పక్కనే ఉన్న రైతు బిడ్డను చూస్తూ.. రతికతో మొదట నడిపిన మనోడి ప్రేమాయణం కాస్త మనకు గుర్తుకు తెస్తుంది.

ఇక మరో పక్క శోభ, రతిక కూర్చుని గౌతమ్‌ గురించి షాకింగ్ కామెంట్స్‌ చేస్తాడు. గౌతమ్‌ బాగోడని.. గౌతమ్‌ కంటే.. యావర్ ప్రిన్స్ బాగున్నాడని.. గౌతమ్‌ ఏప్పుడు చూడు కంటెంట్ ఇ్వవడానికి ప్రయత్నిస్తాడని మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో శోభ ఒక అడుగు ముందుకేసి.. గౌతమ్ తనకు డే 1 నుంచి నచ్చదంటూ.. కామెంట్ చేస్తుంది.

ఇక మరో పక్క శివాజీ ‘నాతోని కావట్లే.. నేను ఇంటికి పోతా.. ఎలిమినేట్ మీ బిగ్ బాస్’ అని అరుస్తుంటే.. ఇంకో పక్క రైతు బిడ్డ.. రతిక గురించి ప్రిన్స్ ను అడుగుతాడు. రతిక మీద తనకు ఫీలింగ్స్ ఉన్నాయని ప్రిన్స్ చెప్పడంతో.. షాకవుతాడు. వద్దురా నాయనా ఈ ప్రేమ అంటూ.. స్టేట్మెంట్స్ ఇస్తాడు.

శివాజీ, షకీలా, అమర్ దీప్ వీళ్లలో ఎవరు రెండవ పరాస్త్రను పొందుతారో తెలుసుకునే సమయం ఆసన్నమైందని మరో టాస్క్ను అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్. లాన్‌ లో పెట్టిన ఓ ఆర్టిఫిషియల్ చెవుల్లో.. ఎవరైతే గట్టిగా బిగ్ బాస్‌ అని అరుస్తారో.. వారే విజేతలంటూ అనౌన్స్ చేస్తాడు.

ఇక ఈ టాస్క్‌ ముగిసిందో లేదో.. చపాతీ చేసే విషయంలో ప్రిన్స్ సందీప్‌ గొడవకు దిగుతారు. నువ్వు వేలు చూపిస్తున్నావని ప్రిన్స్ … నీకు తెలుగు రాదు.. చెప్పేది అర్థం కావట్లేదు అని సందీప్.. ఇలా ఇద్దరూ వాదించుకుంటారు. ఈ గొడవలో.. నీతో వర్కవుట్ కాదని.. ఈ షోలో నువు పనికిరావని నోరు జారుతాడు.

టాస్క్‌ జరుగుతున్న క్రమంలో.. రతిక, రైతు బిడ్డ తమ మధ్య జరిగిన ఇష్యూను సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్లైయింగ్‌ కిస్‌ ఇవ్వడం.. పొట్టి బట్టలు వేసుకోవద్దని.. ఎక్సట్రాలు చేయడం జోకని రైతు బిడ్డ చెప్పడంతో.. ఇది జోకా.. అంటూ.. కాస్త అసహనానికి లోనవుతుంది రతిక. ఏదైన ఒక ఎక్స్‌టెంట్‌కి వెళ్లదంటూ చెప్పే ప్రయత్నం చేస్తుంది.

ఇక ఫైనల్‌గా..ఈ ఎపిసోడ్‌లో… క్రేజీ థింగ్స్‌ ఏంటంటే..! శివాజీ మాటలు.. యాటిట్యూడ్ ఎందుకో పోసాని కృష్ణ మురళిని గుర్తు తెస్తాయి. ప్రిన్స్ రతికల మధ్య లవ్‌ ట్రాక్ మొదలవుతుందనే డౌట్ అందర్లో క్రియేట్ అవుతుంది. శోభ అండ్ రతికకు గౌతమ్‌ అస్సలు నచ్చడనే విషయం కన్వే అవుతుంది. షకీలా.. రోజుకు 10 సిగరెట్లు తాగుతుందనే షాకింగ్ విషయం కూడా మనల్ని షాక్ అయ్యేలా చేస్తుంది.

– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)