Ajay Gadu OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి బిగ్ బాస్ కంటెస్టెంట్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే

బిగ్ బాస్ ఓటీటీలో కంటెస్టెంట్ గా పాటి స్పెట్ చేసిన అజయ్ కొంతమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇపుడు హీరోగా సినిమా చేస్తున్నాడు. అజయ్ గాడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు కూడా ఓటీటీలోనూ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి.

Ajay Gadu OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి బిగ్ బాస్ కంటెస్టెంట్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే
Ajay
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 06, 2024 | 4:32 PM

బిగ్ బాస్ తో చాలా మంది నటీనటులు పాపులర్ అయ్యారు. చాలా మందికి బిగ్ బాస్ వల్ల సినిమా ఛాన్స్ లు కూడా వచ్చాయి. బిగ్ బాస్ ద్వారా చాలా మంది ఫ్యాన్స్ ను, పాపులారిటీని సొంతం చేసుకున్నారు అలాంటి వారిలో అజయ్  కతుర్వర్ ఒకరు. ఇతగాడు బిగ్ బాస్ ఓటీటీతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బిగ్ బాస్ ఓటీటీలో కంటెస్టెంట్ గా పాటి స్పెట్ చేసిన అజయ్ కొంతమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇపుడు హీరోగా సినిమా చేస్తున్నాడు. అజయ్ గాడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు కూడా ఓటీటీలోనూ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఇప్పుడు అజయ్ గాడు సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫెమ్ భాను శ్రీ. శ్వేతా మెహతా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా అజయ్ గాడు సినిమాను ఓటీటీలో రిలీజ్ కానుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. జనవరి 12న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.ఈ సంక్రాంతికి చాలా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సందడి చేయనున్నాయి. గుంటూరు కారం, హనుమాన్, సైందవ్ , నా సామిరంగా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. అదే సమయంలో ఇప్పుడు అజయ్ గాడు సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

View this post on Instagram

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

భానుశ్రీ ఇన్ స్టా గ్రామ్ ..

View this post on Instagram

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.