AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: బిగ్‌బాస్ జస్ట్ మిస్.. జబర్దస్త్‌లోకి ‘అగ్నిపరీక్ష’ రాజకుమారి ఎంట్రీ.. ఎవరి టీమ్‌లో చేస్తుందంటే?

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది డయానా రాజకుమారి. తన పెర్ఫామెన్స్ తో జడ్జీలను మెప్పించింది. తన ఆట, మాట తీరుకు ఆడియెన్స్ కూడా ముగ్ధులయ్యారు. ఇక బిగ్ బాస్ 10లోకి రాజకుమారి ఎంట్రీ ఖాయమనుకున్నారు.. కానీ..

Jabardasth: బిగ్‌బాస్ జస్ట్ మిస్.. జబర్దస్త్‌లోకి 'అగ్నిపరీక్ష' రాజకుమారి ఎంట్రీ.. ఎవరి టీమ్‌లో చేస్తుందంటే?
Rajakumari Dayana
Basha Shek
|

Updated on: Nov 13, 2026 | 5:45 PM

Share

బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది రాజకుమారి డయానా. ఆంధ్రప్రదేశ్‌ లోని రాజానగరం ప్రాంతానికి చెందిన ఆమె తన జీవితంలోని సమస్యలను ఎదుర్కొన్న తీరు చూసి అగ్ని పరీక్ష జడ్జీలు ముగ్ధులయ్యారు. ముఖ్యంగా చిన్న వయసులోనే పెళ్లి కావడం, భర్తకు దూరం కావడం, ముగ్గురు పిల్లల పెంపకం, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా ఎన్నో సమస్యలు, అడ్డంకులను రాజకుమారి ధైర్యంగా అధిగమించింది . అందుకే ఆమె స్ఫూర్తి దాయక ప్రయాణాన్ని చూసిన అగ్ని పరీక్ష జ్యూరీ సభ్యులు వెంటనే ఆమెకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చారు. దీంతో మూడు గ్రీన్ సిగ్నల్స్ అందుకుని నేరుగా టాప్-15లోకి వెళ్లిపోయింది రాజకుమారి. ఆ తర్వాత కూడా మంచిగా ఆటలు ఆడింది డయానా. తనదైన ఆట, మాట తీరుతో జడ్జీలను మెప్పించింది. దీంతో రాజకుమారి కచ్చితంగా బిగ్ బాస్ 10 ఇంట్లోకి వెళుతుందని భావించారు. అయితే అదేమీ జరగలేదు. చివరకు అగ్ని పరీక్ష సీజన్ 2 నుంచి అమ్మాయిల కేటగిరీలో సింగర్ ఝాన్సీ, శృష్టి, షాలినీ, అపూర్వ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొత్తానికి బిగ్ బాస్ 10 టికెట్ ను త్రుటిలో కోల్పోయింది రాజకుమారి. అయితే తాజాగా జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చిందామె.

అగ్ని పరీక్ష కంటెస్టెంట్‌గా రాజ కుమారికి మంచి పేరు, క్రేజ్, ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే అగ్ని పరీక్ష సీజన్ 2 ముందు కూడా అప్పుడప్పుడు జబర్దస్త్ స్కిట్లలో కనిపించేది రాజకుమారి. అయితే అన్నీ చిన్న చిన్న పాత్రలే. అయితే ఇప్పుడు నూకరాజు టీంలో రాజ కుమారి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా రాగా.. అందులో తనదైన పెర్ఫామెన్స్ తో కట్టిపడేసింది డయానా. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గ మారింది. మరి రాజకుమారి జబర్దస్త్ లోనే సెటిలవుతుందా? లేక జస్ట్ గెస్టుగా వచ్చి వెళ్లిందా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

రాజకుమారి డయానా లేటెస్‌ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

కాగా రాజకుమారి డయానా ఎపిసోడ్ ఈ  ఆదివారం (నవంబర్ 15) సాయంత్రం ఆరుగంటలకు టెలికాస్ట్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
రామాయణ తరువాత రాజమౌళి మనసు మార్చుకున్నారా?
రామాయణ తరువాత రాజమౌళి మనసు మార్చుకున్నారా?