Gold Prices: 2026 చివరికల్లా బంగారం ధరలు మళ్లీ రికార్డ్ కొడతాయా..? మతిపోగోట్టే అంచనాలు ఇవిగో..
మరో కొన్ని రోజుల్లో కొత్త ఏడాది వస్తుంది. దీంతో బంగారం ధరలు ఈ ఏడాది చివరికల్లా ఎలా ఉంటాయనే చర్చ మొదలైంది. 2026 డిసెంబర్ నెలాఖరు కల్లా ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనేది అందరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుత పరిణామాలు ఎటువైపు దారితీస్తాయనే దానిపై నిపుణులు ఏం అంటున్నారనేది చూద్దాం.

బంగారం ధరలపై ఎప్పుడూ ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉంటుంది. ధరలు పెరుగుతాయా..? లేదా తగ్గుతాయా? అని ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం బంగారం ధరలు పడిపోతున్నాయి. జనవరిలో తులం బంగారం రూ.1.80 లక్షల రికార్డ్ స్థాయికి చేరుకోగా.. ఆ తర్వాత నుంచి దిగొస్తూ ఉన్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1.38 లక్షల వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1.26 లక్షల వద్ద కొనసాగుతోంది. దీపావళి పండుగ సమయంలో ధరలు స్వల్పంగా పెరిగినా ప్రస్తుతం పతనమవుతూ వస్తోన్నాయి. మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ ఓటమి తర్వాత డాలర్ బలహీనపడుతోంది. ఈ కారణంతో పసిడి ధరలు క్రాష్ అవుతూ వస్తోన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడం కూడా బంగారం ధరల తగ్గుదలకు కారణమవుతోంది.
బంగారం ధరలు పెరుగుతాయా..?
2026 చివరి నాటికి బంగారం ధరలు ఎలా ఉంటాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరో నెల 15 రోజుల్లో కొత్త సంవత్సరం వస్తుండటంతో ధరలు ఇలాగే తగ్గుదలను కొనసాగిస్తాయా.. లేదా ఏడాది చివరి నాటికి పెరుగుతాయా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎవరి అంచనాలు వారు వేస్తుండగా.. ప్రముఖ సంస్థ జేపీ మోర్గాన్ అంచనాలు చర్చకు దారితీశాయి. 2026 చివరినాటికల్లా బంగారం ధరలు భారీగా పెరుగుతాయని ఈ సంస్థ అంచనాలు వేసింది. ప్రస్తుతం ఔన్సుకు 4 వేల డాలర్ల వద్ద ఉండగా.. ఈ ఏడాది చివరినాటికి 6 వేల డాలర్లకు చేరుకునే అవకాశముందని అంచనా వేసింది. అంటే ఒకేసారి 46.34 శాతం పెరిగే అవకాశముందని జేపీ మోర్గాన్ చెబుతోంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి, యూఎస్ కార్మిక మార్కెట్ వంటివి బంగారం ధరల పెరుగుదలకు బలాన్ని చేకూరుస్తున్నట్లు విశ్లేషించింది.
బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయి..?
-ప్రపంచవ్యాప్తంగా అన్ని సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. బంగారం నిల్వలను రోజురోజుకు పెంచుకుంటున్నాయి. అలాగే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లను అధికంగా ఉంచనున్నాయనే ఆందోళనలు నెలకొన్నాయి
-డాలర్ బలహీనపడటం వల్ల ఇరత కరెన్సీలు కలిగి ఉన్నవారికి బంగారం తక్కువకే లభిస్తుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లకు బలమిచ్చి బులియన్ ధరలు పుంజుకోవడానికి తోడ్పాటు అందిస్తుంది
-భౌగోళికంగా రాజకీయ అనిశ్చితి, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్ధిక విధానాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణం కానున్నాయి. వడ్డీ రేట్లు, డాలర్, పెట్టుబడి ప్రవాహలు బంగారం ధరలను ప్రభావం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నాయి.
-ముడి చమురు ధరల్లో ఒడిదొడుకులు కూడా ద్రవ్యోల్బణానికి దారితీస్తాయి. దీన వల్ల బంగారంపై పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం వల్ల ధరలు మారుతుంటాయి
-దేశాల మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరలకు కారణమయ్యే అవకాశముంది
