Winter Hair Care Tips: చలిగాలులకు జుట్టు బట్టలకు అంటుకుంటుందా? ఇదిగో సింపుల్ చిట్కా!
చలికాలం వచ్చిందంటే చర్మంతో పాటు జుట్టు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా చల్లటి గాలుల ప్రభావంతో జుట్టులో తేమ తగ్గిపోయి పొడిగా, నిర్జీవంగా మారుతుంది. జుట్టు ఎంత అందంగా దువ్వుకున్నా కాసేపటికే చిందరవందరగా మారుతుంది. కొన్నిసార్లు జుట్టు పైకి లేచి బట్టలకు రివ్వుమని అంటుకుంటుంది. దీంతో బయటకు వెళ్లేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంటుంది.

జుట్టు బట్టలకు ఎందుకు అంటుకుంటుంది?
చలిగాలుల్లో గాలిలో తేమ శాతం తగ్గుతుంది. దీంతో జుట్టు సహజ తేమను కోల్పోయి పొడిబారుతుంది. జుట్టు దువ్వుకునేటప్పుడు, ఉన్ని దుస్తులకు రుద్దుకున్నప్పుడు స్థిర విద్యుత్ (స్టాటిక్ ఎలక్ట్రిసిటీ) ఏర్పడుతుంది. ఫలితంగా వెంట్రుకలు ఒకదానికొకటి లేదా బట్టలకు అంటుకుంటాయి.
ఈ చిన్న చిట్కాతో సమస్యకు చెక్ పెట్టండి
జుట్టు మరీ పొడిగా అనిపిస్తే తలస్నానం చేసిన తర్వాత మంచి కండిషనర్ ఉపయోగించాలి. అలాగే జుట్టు చివర్లకు కొద్దిగా లీవ్-ఇన్ కండిషనర్ లేదా హెయిర్ సీరమ్ రాయడం వల్ల తేమ నిలిచి ఉంటుంది. దీంతో జుట్టు ఎగిరిపోవడం, బట్టలకు అంటుకోవడం తగ్గుతుంది.
జుట్టు సంరక్షణలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
మరీ వేడి నీటితో తలస్నానం చేయకండి.
-
తరచూ హెయిర్ డ్రయ్యర్ ఉపయోగించకుండా ఉండండి.
-
జుట్టును బలంగా రుద్దకుండా మృదువైన టవల్‌తో ఆరబెట్టండి.
-
ప్లాస్టిక్ దువ్వెనకు బదులుగా చెక్క దువ్వెన ఉపయోగించవచ్చు.
-
జుట్టు తేమను కాపాడేందుకు తగిన కండిషనర్ వాడండి.
గమనిక: జుట్టు సమస్యలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. మీ జుట్టు రకానికి సరిపోయే ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించండి.
