AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుర్మార్గులు సార్..! కావాలనే ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు.. నాగార్జున క్లాస్ తీసుకోవాల్సిందే

గ్‌బాస్ సీజన్ 9.. ఈవారం ఒక్కరు తప్ప అందరూ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈరోజు వచ్చిన ఫస్ట్ ప్రోమోలో రాజులు, ప్రజలు , కమాండర్లు అంటూ కొత్త గేమ్ స్టార్ట్ చేశారు. అందులో నిఖిల్, తనూజ, సంజన డీమాన్ నలుగురికి ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. కమాండర్స్ మీలో ఒకరు మీ స్థానాన్ని రిస్కులో పెట్టి ప్రజలలో ఒకరిని ఎంచుకుని వారితోటి పోరాడాల్సి ఉంటుందని చెప్పాడు.

దుర్మార్గులు సార్..! కావాలనే ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు.. నాగార్జున క్లాస్ తీసుకోవాల్సిందే
Bigg Boss9.
Rajeev Rayala
|

Updated on: Nov 12, 2025 | 7:45 AM

Share

బిగ్ బాస్ సీజన్ 9లో రచ్చ రచ్చ జరుగుతుంది. హౌస్ లో రెండు టీమ్స్ గా డివైడ్ అయ్యి టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్.. ఇక ఇప్పటికే హౌస్ లో రీతూ, కళ్యాణ్, దివ్యలను రాజు, రాణులుగా నియంనించాడు బిగ్ బాస్. అలాగే పవన్ , సంజన, నిఖిల్, సంజనను కమాండర్లు గా పెట్టాడు. మిగిలిన వారిని ప్రజలు అని చెప్పాడు. అలాగే కమాండర్లుగా ఉన్న నలుగురిలో ఒకరు ప్రజలతో పోటీ పడాలి.. అలా పోటీ పది గెలిచినా వారు తమ కమాండర్ స్థానాన్ని నిలుపుకుంటారు. ఒకవేళ ప్రజలు గెలిస్తే వారికి కమాండర్ స్థానం వెళ్తుంది అంటూ టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్. ముందుగా నలుగురు కమాండర్లకు టాస్క్ పెట్టాడు. నలుగురికి బాస్కెట్స్ ఇచ్చి ఒకరి బాస్కెట్ లో ఒకరు బాల్స్ వేసే ప్రయత్నం చేయాలి చివరిగా ఎవరి బాస్కెట్ లో బాల్స్ ఎక్కువగాఉంటే వారు విన్ అయినట్టు అని చెప్పాడు బిగ్ బాస్.

ఈ టాస్క్ లో పెద్ద రచ్చే జరిగింది. ఈ టాస్క్ కు సంచులక్ గా రీతూ ని నియమించాడు బిగ్ బాస్. దాంతో ఆమె పవన్ ను సేవ్ చేయడానికి చాలా ట్రై చేసింది. అతను ఫౌల్ గేమ్ ఆడినా కూడా అతనికి సపోర్ట్ చేసింది. ఫైనల్ గా ఈ టాస్క్ లో సంజన విన్ అయ్యింది. దాంతో సంజన , ప్రజల్లో ఒకరితో పోటీ పడాల్సి ఉంటుంది. కాగా హౌస్ లో కొన్ని బాక్స్ లు పెట్టి వాటిని ఒకదానిపై ఒకటి పెట్టుకుంటూ టవర్ నిర్మించాలి. కాంగ్ మోగే సమయం వరకు ఎవరి టవర్ అయితే ఎత్తుగా ఉంటుందో వారే విజేతలు అని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్క్ కు కళ్యాణ్ సంచలక్ గా ఉన్నాడు.

ఇక కమాండర్లలో విన్నర్ అయిన సంజనను మీతో పోటీ పడే ప్రజలను మీరే ఎంచుకోండి అని చెప్పగా.. ఆమె సుమన్ శెట్టిని సెలక్ట్ చేసుకుంది. సుమన్ హాట్ రీత్యా మనోడు ఎక్కువ బాక్స్ లు పెట్టలేదు అని అతన్ని సెలక్ట్ చేసుకుంది సంజన. కానీ సుమన్ శెట్టి మామూలోడు కాదు. కాంగ్ మోగగానే.. సుమన్ , సంజన ఇద్దరూ బాక్స్ లు ఒకదాని పై ఒకటి పెట్టడం స్టార్ట్ చేశారు. సంజన చెకచక బాక్స్ లు పెట్టేసింది. అలాగే సుమన్ కూడా చాలా స్పీడ్ గా బాక్స్ లు పెట్టాడు. తన హైట్ కు అందకపోయినా సుమన్ బాక్స్ లను ఎగరేసి మరి టవర్ నిర్మించాడు. ఫైనల్ గా కాంగ్ మోగే సమయానికి ఇద్దరూ ఒకే ఎత్తులో టవర్ నిర్మించారు. అయితే సంజన టవర్ స్ట్రయిట్ గా పర్ఫెక్ట్ గా ఉంది.. సుమన్ ది చివరి బాక్స్ కాస్త వంకరగా ఉండటంతో.. సంజనను విన్నర్ అంటూ అనౌన్స్ చేశాడు కళ్యాణ్. దాంతో పెద్ద గొడవే అయ్యింది. కళ్యాణ్ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. తనూజ, దివ్య సీరియస్ అయ్యారు. ఇద్దరూ కళ్యాణ్ పై పెద్ద గొడవే వేసుకున్నారు. ముఖ్యంగా తనూజన కళ్యాణ్ కు పెద్ద వాదన జరిగింది. మధ్యలో చివరి బాక్స్ నేనే ముందుగా వేసాను.. కదా.. అని సుమన్ శెట్టి అమాయకంగా అడిగినా కూడా. కళ్యాణ్ సంచలక్ గా నేను చెప్పిందే ఫైనల్ అని అన్నాడు. దాంతో సంజన విన్ అయ్యింది. కానీ సుమన్ శెట్టి.. కష్టాన్ని  దృష్టిలో పెట్టుకొని అతన్ని విన్నర్ ను చేయాల్సింది. కళ్యాణ్ చాలా తెలివి తక్కువగా నిర్ణయం తీసుకున్నాడు అని ప్రేక్షకులు అంటున్నారు. సుమన్ శెట్టిని కావాలనే టార్గెట్ చేశారు. ఆయన తన హైట్ ను కూడా ఆలోచించకుండా టాస్క్ లో పాల్గొని.. టైం కు బాక్స్ లు పెట్టాడు.. కాబట్టి అతన్నే విన్నర్ ను చేయాలి అని ప్రేక్షకులు అంటున్నారు. ఏది ఏమైనా సంచలక్ నిర్ణయం ఫైనల్ గా బట్టి సంజన విన్నర్ అయ్యింది. మరి వారాంతంలో నాగ్ ఎంట్రీ ఇచ్చి కళ్యాణ్ కు క్లాస్ తీసుకుంటారేమో చూడాలి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.