AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: ఇదెక్కడి ట్విస్ట్ మావా.. ఈ వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్.. మళ్లీ అమ్మాయినే పంపిస్తున్నారా..?

విష్ణుప్రియకు ఓటింగ్ ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం కూడా సోనియానే. నామినేషన్స్ సమయంలో విష్ణుప్రియను దారుణంగా అవమానించింది సోనియా. బట్టలు సరిగ్గా వేసుకోవు అంటూ అసభ్యంగా మాట్లాడి తన ఇమేజ్ పూర్తిగా తగ్గించుకుంది. దీంతో సోనియా పై నెటిజన్స్ ఓ రేంజ్ లో

Bigg Boss 8 Telugu: ఇదెక్కడి ట్విస్ట్ మావా.. ఈ వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్.. మళ్లీ అమ్మాయినే పంపిస్తున్నారా..?
Bigg Boss 8 Telugu
Rajitha Chanti
|

Updated on: Sep 11, 2024 | 8:31 PM

Share

బిగ్‏బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. సీజన్ 8 స్టార్ట్ అయి ఇంకా రెండు వారాలే అవుతున్నా.. ఇప్పటికే ఛాలెంజింగ్ టాస్కులతో కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నాడు బిగ్‏బాస్. మొదటివారం హీటెక్కించిన నామినేషన్స్.. ఇక రెండో వారం కూడా అదే స్థాయిలో జరిగాయి. మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రెండో వారం ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మంగళవారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా.. అనూహ్యంగా యాంకర్ విష్ణుప్రియ అగ్రస్థానంలో దూసుకుపోతుంది. విష్ణుప్రియకు ఓటింగ్ ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం కూడా సోనియానే. నామినేషన్స్ సమయంలో విష్ణుప్రియను దారుణంగా అవమానించింది సోనియా. బట్టలు సరిగ్గా వేసుకోవు అంటూ అసభ్యంగా మాట్లాడి తన ఇమేజ్ పూర్తిగా తగ్గించుకుంది. దీంతో సోనియా పై నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

సోనియా హద్దుమీరి మాట్లాడుతున్నప్పటికీ విష్ణుప్రియ ఏమాత్రం ఎమోషనల్ కాకుండా తన మాటలను తిప్పికొట్టడంతో ఇప్పుడు నెటిజన్స్ కూడా విష్ణుకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓటింగ్ లో విష్ణు టాప్ లో దూసుకుపోతుండగా.. ఆ తర్వాతి స్థానంలో నిఖిల్ ఉన్నాడు. వీరిద్దరి మధ్య కేవలం పోటీ తక్కువే ఉంది. అటు విష్ణుకు 26 శాతం ఓటింగ్ రాగా.. నిఖిల్ 24 శాతం ఓటింగ్ తో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత మూడో స్థానంలో నాగ మణికంఠ ఉండగా.. ఆ తర్వాత నైనిక నాల్గో స్థానంలో నిలిచింది.

ఇక శేఖర్ భాషా ఐదో స్థానంలో ఉంటే.. ఆదిత్య ఓం ఆరో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య కేవలం ఒక పర్సెంట్ మాత్రమే ఓటింగ్ డిఫరెంట్ ఉండడం గమనార్హం. ఇక వీరి తర్వాత చివరి స్థానాల్లో పృథ్వీ, సీత ఉన్నారు. వీరిద్దరికి తక్కువ ఓటింగ్ వస్తుండడంతో ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయనున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈవారం పృథ్వీ కాకుండా సీతను ఎలిమినేట్ చేస్తారని సందేహపడుతున్నారు నెటిజన్స్. అందుకు కారణం ఆమె పీఆర్ టీం. అవును.. ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్న సీత సంబంధించిన పోస్టింగ్స్ మాత్రం అంతగా కనిపించలేదు. పృథ్వీ కంటే సీత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా.. శుక్రవారం వరకు వచ్చే ఓటింగ్ బట్టి ఎలిమినేషన్ పై స్పష్టత రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా