బిగ్ బాస్ సీజన్ 8లో నిన్నటి ఎపిసోడ్ కాస్త సరదాగా , కాస్త ఎమోషనల్ గా సాగింది. హౌస్ మేట్స్ తో ఫన్నీ గేమ్స్ ఆడించిన బిగ్ బాస్ ఆతర్వాత హౌస్ మేట్స్ కు తమ ఇంటిదగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్ చూపించి ఎమోషనల్ చేశాడు. హౌస్ లో ముందుగా చాలా డిస్కషన్స్ జరిగాయి. సోనియాకి అభయ్.. ప్రేరణకి నిఖిల్ క్లాస్ తీసుకున్నాడు. ఆతర్వాత విష్ణు ప్రియా గురించి మరోసారి సోనియా డిస్కషన్ పెటింది. అలాగే శేఖర్ భాష గురించి కూడా మాట్లాడింది సోనియా. ఆతర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు స్పిన్ ది బాటిల్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ కు శేకర్ భాషను సంచలక్ గా నియమించాడు. ఈ టాస్క్ లో ముందుగా యష్మీ వైపు బాటిల్ ఆగింది. ట్రూత్ ఆర్ డేర్ అంటే యష్మీ ట్రూత్ ను సెలక్ట్ చేసుకుంది. హౌస్ లో నువ్వు చెప్పిన అతిపెద్ద అబద్దం ఏంటి అని అభయ్ అడిగితే.. అమ్మడు తెగ సిగ్గుపడిపోయింది. చికెన్ దొంగతనం చేసి చేయలేదంటూ విష్ణుతో గొడవ పడ్డా అని చెప్పింది.
ఆ తర్వాత బాటిల్ విష్ణు ప్రియా వైపు తిరిగింది. దాంతో నాగమణికంఠ విష్ణుని పోల్ డాన్స్ చేయమన్నాడు. విష్ణు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి డాన్స్ చేసి వచ్చేసింది. ఆతర్వాత మిగిలిన వారిలో ఆదిత్య ఓ లిప్స్టిక్ వేసుకోవాలి అని, నిఖిల్ ను అమ్మాయిలా చీరకట్టుకొని నడుం కనపడాలి, డాన్స్ చేయాలి అని డేర్ ఇచ్చారు. దానికి నిఖిల్ రెచ్చిపోయాడు. చీర కట్టుకొని డాన్స్ చేశాడు. అలాగే నైనికాను ఓ అబ్బాయిని ఎత్తుకెళ్ళి స్విమింగ్ పూల్ లో పడేయాలని డేర్ ఇచ్చారు. దాంతో శేఖర్ భాషను ఎత్తుకెళ్ళి పూల్ లో పడేసింది. ఈ క్రమంలో ఆమె కూడా పూల్ లో పడిపోయింది.
ఆ తర్వాత హౌస్ మేట్స్ ను బిగ్ బాస్ ఏడిపించేశాడు. హౌస్‌లోకి వచ్చి రెండు వారాలు గడిచింది.. మీకిష్టమైన వారిని మిస్ అవుతున్నారని మాకు తెలుసు. మీ ఇంట్లో వాళ్ల జ్ఞాపకాలు మీతోనే ఉంచుకునే అవకాశం ఉంది అంటూ.. హౌస్ లో ఉన్నవారిలో ఇద్దరినీ పిలిచి మిగిలిన వారికీ ఒకొక్క లాలీపప్స్ ఇచ్చి.. ఆ ఇద్దరూ హౌస్ నుంచి వచ్చిన గిఫ్ట్స్ తో తమకు ఉన్న అనుబంధం చెప్పాలి అని అలా చెప్పిన వారిలో హౌస్ మేట్స్ ఎవరికైతే ఎక్కువ లాలీ పాప్స్ ఇస్తారో వల్ల గిఫ్ట్ ఉంటుందని మరొకరిది తిరిగి వెళ్ళిపోతుందని చెప్పాడు బిగ్ బాస్. ఇలా ఐదుగురు సబ్యులకు సంబందించిన గిఫ్ట్స్ ఉంటాయని తెలిపాడు బిగ్ బాస్. మిగిలింది మరో ఆర్టికల్ లో చూద్దాం.!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.