Bigg Boss 8 Telugu : బిగ్‏బాస్ నుంచి సీత ఎలిమినేట్.. ఆరు వారాలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుందంటే..

టాస్కులలో అబ్బాయిలతో పోటీపడి మరీ ఇదరగదీసింది. కానీ ఈ వారం అనుహ్యంగా సీత బయటకు వచ్చే్సింది. పవర్ ఆఫ్ గర్ల్స్ గ్యాంగ్ లో ఒక్కొక్కరూ వరుసగా ఎలిమినేట్ అవుతున్నారు. సీత, నైనిక, విష్ణు ముగ్గురు హౌస్ లో మంచి స్నేహితులుగా ఉండగా.. వీరిలో నైనిక, సీత ఇద్దరూ ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు విష్ణు ఒక్కరే మిగిలింది.

Bigg Boss 8 Telugu : బిగ్‏బాస్ నుంచి సీత ఎలిమినేట్.. ఆరు వారాలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుందంటే..
Kirrak Seetha
Follow us

|

Updated on: Oct 14, 2024 | 11:24 AM

బిగ్‏బాస్ సీజన్ 8 అందరూ ఊహించినట్లుగానే ఈ వారం కిర్రాక్ సీత ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం అందరి కంటే తక్కువ ఓటింగ్ సీతకు రావడంతో ఆమె బయటకు వచ్చేసింది. అయితే వెళ్తూ వెళ్తూ సీత ముగ్గురికి బ్లాక్ హార్ట్స్, ముగ్గురికి వైట్ హార్ట్స్ ఇచ్చింది. నిఖిల్ హస్బెంట్ మెటిరియల్ అంటూనే అతడికి బ్లాక్ హార్ట్ ఇచ్చింది. అలాగే విష్ణు, నబీల్, ముక్కు అవినాష్ కు వైట్ హార్ట్స్ ఇచ్చింది. అయితే మొదట్లో కిర్రాక్ సీత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నిరూపించుకుంది. టాస్కులలో అబ్బాయిలతో పోటీపడి మరీ ఇదరగదీసింది. కానీ ఈ వారం అనుహ్యంగా సీత బయటకు వచ్చే్సింది. పవర్ ఆఫ్ గర్ల్స్ గ్యాంగ్ లో ఒక్కొక్కరూ వరుసగా ఎలిమినేట్ అవుతున్నారు. సీత, నైనిక, విష్ణు ముగ్గురు హౌస్ లో మంచి స్నేహితులుగా ఉండగా.. వీరిలో నైనిక, సీత ఇద్దరూ ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు విష్ణు ఒక్కరే మిగిలింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు కిర్రాక్ సీత రెమ్యునరేషన్ గురించి నెట్టింట తెగ ప్రచారం జరుగుతుంది. సీతకు వారానికి రూ.2 లక్షలు పారితోషికం ఇచ్చినట్లు టాక్. అంటే ఈ లెక్కన చూస్తే ఆరు వారాలకు గానూ దాదాపు రూ.12 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. కిర్రాక్ సీత.. 7 ఆర్ట్స్ వంటి యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ ఫిల్మ్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. నెట్టింట మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సీత.. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన బేబీ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది. ఇందులో ఆమె కథను మలుపు తిప్పే పాత్రలో నటించింది. దీంతో ఈ సినిమాతో సీతకు మంచి క్రేజ్ వచ్చేసింది.

ఇవి కూడా చదవండి

ఇక అదే ఫాలోయింగ్ బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టింది సీత. ఇన్నాళ్లు తన నటనతో ఆకట్టుకున్న సీత.. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తనను తాను మరింత నిరూపించుకునే మార్గం అని చెప్పింది. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి నాలుగు వారాల్లో సీత టాస్కులలో అదరగొట్టింది. కానీ నెమ్మదిగా ఆమె గ్రాఫ్ పడిపోయింది. అలాగే కొన్ని సందర్భాల్లో అనవసరంగా ఎమోషనల్ కావడం.. డల్ అయిపోవడంతో సీత ఆట తగ్గిందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.