AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ఇదెక్కడి దిక్కుమాలిన టాస్క్ రా బాబు.. కన్నీటితో గ్లాస్ నింపడం ఏంటి గురూ..!

హౌస్ లోకి  14 మందిని పంపించి అందులో విన్ అయిన వాళ్ళే బిగ్ బాస్ హౌస్ లో కంటిన్యూ అవుతారని తెలిపాడు. ఇప్పటికే ముగ్గురు హౌస్ మేట్స్ గా కన్ఫర్మ్ అయ్యారు. సందీప్, శివాజీ, శోభా శెట్టి హౌస్ మేట్స్ గా కన్ఫామ్ కాగా ఇప్పుడు నాలుగో పవర్ అస్త్ర సాదించేందుకు కంటెండర్ కావడానికి టాస్క్ లు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ వెరైటీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో ఇదెక్కడి దిక్కుమాలిన టాస్క్ రా బాబు అంటూ మండిపడుతున్నారు ప్రేక్షకులు. ఇంతకు అంత వెరైటీ టాస్క్ ఏంటా అనుకుంటున్నారు.. ?

Bigg Boss 7 Telugu: ఇదెక్కడి దిక్కుమాలిన టాస్క్ రా బాబు.. కన్నీటితో గ్లాస్ నింపడం ఏంటి గురూ..!
Amardeep, Prashanth
Rajeev Rayala
|

Updated on: Sep 28, 2023 | 12:59 PM

Share

బిగ్ బాస్ లో ఇస్తున్న టాస్క్‌లు చాలా చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా గా ఉంటుందని ముందుం ఉంచి చెప్పుకొచ్చారు మేకర్స్. చెప్పినట్టుగానే హౌస్ లోకి  14 మందిని పంపించి అందులో విన్ అయిన వాళ్ళే బిగ్ బాస్ హౌస్ లో కంటిన్యూ అవుతారని తెలిపాడు. ఇప్పటికే ముగ్గురు హౌస్ మేట్స్ గా కన్ఫర్మ్ అయ్యారు. సందీప్, శివాజీ, శోభా శెట్టి హౌస్ మేట్స్ గా కన్ఫామ్ కాగా ఇప్పుడు నాలుగో పవర్ అస్త్ర సాదించేందుకు కంటెండర్ కావడానికి టాస్క్ లు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ వెరైటీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో ఇదెక్కడి దిక్కుమాలిన టాస్క్ రా బాబు అంటూ మండిపడుతున్నారు ప్రేక్షకులు. ఇంతకు అంత వెరైటీ టాస్క్ ఏంటా అనుకుంటున్నారు.. ? అదే కన్నీళ్లతో గ్లాస్ లను నింపడం.

ఇదేటాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఈ టాస్క్ పూర్తిచేయడని నానా తంటాలు పడ్డారు కంటెస్టెంట్స్. ముందుగా ఇచ్చిన బ్యాంక్ గేమ్ లో ఈసారి బజర్ ను ప్రిన్స్ ముందుగా ప్రెస్ చేశాడు. దాంతో అతడు తన పార్టనర్ గా పల్లవి ప్రశాంత్  ను ఎంచుకున్నాడు. అలాగే అపోజిట్ టీమ్ గా అమర్ అండ్ గౌతమ్ ను ఎంచుకున్నాడు. అయితే బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ ఇస్తాడేమో అని అంతా అనుకున్నారు కానీ ఊహించని విధంగా కన్నీళ్లను గ్లాస్ లో నింపాలని టాస్క్ ఇచ్చాడు.

గేమ్ మొదలు పెట్టగానే అమర్ అండ్ గౌతమ్ కంట్లో ఉల్లిపాయలు, నిమ్మకాయలు పిండుకున్నారు. కానీ అలాంటివేమీ కుదరవు సహజంగానే కన్నీళ్లు తెచ్చుకొని వాటితో గ్లాస్ ను నింపాలని టాస్క్ ఇచ్చాడు దాంతో అమర్ చాలా కష్టపడ్డాడు కన్నీళ్ల కోసం కావాలని లోపల బాధను బయటకు తెచుకున్నాడు. అలాగే గౌతమ్ నన్ను తిట్టండి అంటాయి అడిగి మరి తిట్టించుకొని ఎమోషల్ అవ్వాలని ప్రయత్నించాడు. ఆతర్వాత ప్రిన్స్ , రైతుబిడ్డ వంతు వచ్చింది. ఇక మనోడు ప్రశాంత్ ముందునుంచి ఏడుస్తూనే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు కదా దాన్నే ఇక్కడ కూడా వాడాడు. కిందపడి పైన పడి తెగ ఏడ్చేశాడు. అది చూసిన శోభా శెట్టి కూడా ఏడుపు అందుకుంది. రతికా అయితే ఒక రకమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. మొత్తానికి ఈ గేమ్ లో ప్రిన్స్, ప్రశాంత్ విన్ అయ్యారు. దాంతో అమర్ , గౌతమ్ దగ్గరున్న కాయిన్స్ ను లాగేసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.