బిగ్‌బాస్ ఈ సీజన్ మరింత హుషారుగా స్టార్ట్ అయింది.. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఖుషీ ఖుషీగా కనిపించారు. ఈ సందర్భంగా నాగార్జున, విజయ్ దేవరకొండ మాటల్లో సమంత ప్రస్తావన అందరి దృష్టినీ ఆకర్షించింది. స్టేజ్‌పై మీ హీరోయిన్ ఎక్కడ అంటూ నాగ్ అడిగారు.. దానికి విజయ్ ఆన్సర్ ఏంటి.. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. చైతూ-సమంత విడాకులు తీసుకున్నా.. సామ్ ప్రస్తావన వచ్చినప్పుడు నాగ్ మాట్లాడిన తీరు మాత్రం చాలా హుందాగా ఉంది. ఇప్పుడు ఇంకో విషయం గురించి కూడా చర్చ జరుగుతోంది. అదే సమంత హెల్త్.. ఆమె హెల్త్ ఇంకా సెట్ కాలేదా? అని కొందరు అంటుంటే.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో నాగార్జునకు తెలియదా? వాళ్లు టచ్‌లో లేరా? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్‌కీ, సమంతకీ మధ్య నటన పోటీపోటీగా ఉంటుందనే విషయాన్ని ప్రస్తావిస్తూ, సమంతను మంచి నటి అని మెచ్చుకున్నారు నాగార్జున. ఇలా ప్రొఫెషనల్‌గా ఆమెకు నాగ్ ఇచ్చిన కాంప్లిమెంట్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. కాగా గతంలో నాగార్జున బిగ్ బాస్ కొన్ని ఎపిసోడ్లు చేయలేకపోయినప్పుడు, ఆ ప్లేస్‌ని భర్తీ చేసింది సమంత. ఇప్పుడు సమంత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. 13 ఏళ్లుగా నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తున్నానని, ఇది మోస్ట్ వాంటెడ్ బ్రేక్ అనీ అన్నారు. గతంలో కోడలి హోదాలో నాగ్ కోసం బిగ్‌బాస్ చేసిన సమంత… మరోసారి అలాంటి అవకాశం వస్తే చేస్తారా? పర్సనల్‌గా అనుబంధం తెగిపోయినా, లాస్ట్ టైమ్ సక్సెస్‌ఫుల్ హోస్ట్ కాబట్టి, అలాంటి అవకాశాన్ని మళ్లీ నాగ్… సమంతకి ఆఫర్ చేస్తారా? బిగ్ బాస్ వేదిక మీద సమంత పేరు నాగ్ నోటి వెంట విన్న వాళ్లల్లో ఇలాంటి ఆలోచనలు ఎన్నెన్నో వస్తున్నాయి ఫ్యాన్స్‌కి.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. సెప్టెంబర్ 1న రిలీజైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడురోజుల్లో మొత్తం రూ. 70 కోట్ల వసూళ్లు చేసినట్లు దర్శకనిర్మాతలు ప్రకటించారు. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీలో జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు యలమంచిలి రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించిన ఈ సినిమాకు హృదయం ఫేమ్ అబ్దుల్ వాహబ్ స్వరాలు సమకూర్చారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఖుషి సినిమా రిలీజయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.