AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: వీర సింహాలు వర్సెస్ గర్జించే పులులు.. పోటాపోటీగా ఆడిన రెండు టీమ్స్

వీరసింహాలు టీమ్ లో యావర్, గౌతమ్, భోలే, తేజ, శోభా, రతిక ఉన్నారు. అలాగే గర్జించే పులులు టీమ్ లో అర్జున్, ప్రశాంత్, శివాజీ, అమర్, ప్రియాంక, అశ్విని.. ఈ రెండు టీమ్స్ కు హాల్ ఆఫ్ బాల్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఉంచిన ఓ పైప్ ద్వారా చిన్న చిన్న బాల్స్ పడుతూ ఉంటాయి. వాటిని టీమ్స్ వాళ్లకు ఇచ్చిన సంచుల్లో నింపుకోవాలి.

Bigg Boss 7 Telugu: వీర సింహాలు వర్సెస్ గర్జించే పులులు.. పోటాపోటీగా ఆడిన రెండు టీమ్స్
Bigg Boss 7 Telugu
Rajeev Rayala
|

Updated on: Nov 02, 2023 | 7:17 AM

Share

బిగ్ బాస్ హోస్ లో నిన్నటి ఎపిసోడ్ లో కంటెంటెండర్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందుకోసం హౌస్లో ఉన్న వారిని రెండు టీమ్స్ గా డివైడ్ చేశాడు బిగ్ బాస్.. ఒక టీమ్ కు వీర సింహాలు.. మరో జట్టుకి గర్జించే పులులు అనే పేరు పెట్టారు. వీరసింహాలు టీమ్ లో యావర్, గౌతమ్, భోలే, తేజ, శోభా, రతిక ఉన్నారు. అలాగే గర్జించే పులులు టీమ్ లో అర్జున్, ప్రశాంత్, శివాజీ, అమర్, ప్రియాంక, అశ్విని.. ఈ రెండు టీమ్స్ కు హాల్ ఆఫ్ బాల్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఉంచిన ఓ పైప్ ద్వారా చిన్న చిన్న బాల్స్ పడుతూ ఉంటాయి. వాటిని టీమ్స్ వాళ్లకు ఇచ్చిన సంచుల్లో నింపుకోవాలి. ఆ సంచులను లేదా బాల్స్ ను బట్టల్లో కానీ, బ్యాగుల్లో కానీ, సూట్ కేస్ లో కానీ ఉంచకూడదు అని చెప్పాడు బిగ్ బాస్. బజార్ మోగడంతోనే గేమ్ స్టార్ట్ అయ్యింది. బాల్స్ పై నుంచి పడుతుండటంతో హాట్ ఉన్న అర్జున్ తన సంచిని నింపుకున్నాడు కానీ ఇంతలో గౌతమ్ దాన్ని లాకొన్ని కింద పడేశాడు. చాలా మంది కింద పడిన బాల్స్ ఏరుకొనే పనిలో పడిపోయారు.

అయితే గౌతమ్ తన సంచి లాగడంతో అర్జున్ కు కోపం వచ్చింది. నేను కూడా లాగేస్తా.. రతికా దగ్గర చాలా బాల్స్ ఉన్నాయి నేను లాగేస్తా అని గట్టిగా అరిచాడు. దాంతో రతికా భయపడిపోయింది అది కవర్ చేసుకోవడానికి నేను ఎంటరైతే సీన్ రివర్స్ ఉంటది ఇంక అంటూ డైలాగ్ కొట్టింది. సంచులు నిండిన తర్వాత రతికా పాప అతితెలివి చూపించింది.  తన బాల్స్ ను పిల్లో కవర్ లో వేసి దాన్ని మంచం దగ్గర దాచిపెట్టింది. అది ఫౌల్ గేమ్ అని గౌతమ్ చెప్పడంతో తెలివిగా ఆ సంచిని ఎవరికీ కనిపించకుండా బయటకు తెచ్చేసింది. ఆ తర్వాత బాల్స్ లా కనిపించడానికి ఉల్లిపాయలు సంచిలో వేసింది.

ఇక యావర్ అర్జున్ దగ్గర కూర్చొని తెలివిగా అతని దగ్గరున్న సంచిని కొట్టేశాడు.దాన్ని తెచ్చి రతికాకు ఇచ్చాడు. ఆమె దాన్ని టీషర్ట్ లోపల దాచుకుంది. ఆ తర్వాత ఎందుకులే అని తిరిగి ఇచ్చేశారు. ఆతర్వాత పవర్ బాక్స్ ఛాలెంజ్ అంటూ మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. జంపింగ్ జపాంగ్ అనే గేమ్ ఆడించాడు బిగ్ బాస్. ఒకొక్క టీమ్ నుంచి ఇద్దరు ఆడాల్సి ఉంటుంది. ఒకరు బెలూన్ ఊదుతుంటే  మరొకరు ఆ బెలూన్లను టైర్ల మధ్యలో ఫిట్ చేయాలి. ఎవరు విన్ అయ్యితే వారికి ఆ టీమ్ కు ఓ పవర్ వస్తుంది. బెలూన్ ను ఫిట్ చేయడానికి అర్జున్,యావర్ వెళ్లగా.. బెలూన్ ఊదడానికి ప్రశాంత్, తేజ వెళ్లారు. చివరికి వీర సింహాలు టీమ్ 2 బెలూన్లు ఎక్కువ ఫిట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us