Bigg Boss Season 7: ఏందయ్యా శివాజీ మళ్లీ అదే లొల్లి.. శోభా శెట్టి గట్టిగానే వాదించిందిగా!

బిగ్ బాస్ హౌస్‌లో మొదటి వారంలో బాగానే ఉన్న శివాజీ తన ఆట తో నాగార్జునను కూడా మెప్పించారు. ఇక రెండో వారం నుంచి నేను హౌస్ లో ఉండను వెళ్ళిపోతాను అంటూ కామెంట్స్ చేశాడు. దాంతో నాగార్జున కూడా అది బిగ్ బాస్ రూల్స్ కు వెతిరేకం. ఇంకోసారి హౌస్ నుంచి వెళ్ళిపోతానంటే.. మేమె పంపించేస్తాం అని వార్నింగ్ కూడా ఇచ్చారు. దాంతో శివాజీ హౌస్ లో తన ఆట ను మెరుగుపరిచారు.  

Bigg Boss Season 7: ఏందయ్యా శివాజీ మళ్లీ అదే లొల్లి.. శోభా శెట్టి గట్టిగానే వాదించిందిగా!
Bigg Boss 7 Telugu
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 29, 2023 | 9:00 AM

బిగ్ బాస్ సీజన్ 7లో అంతో ఇంతో ఎక్కువగా ప్రేక్షకుల తెలిసిన పేరు శివాజీ. హీరోగా శివాజీ చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే రాజకీయాల పై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో మొదటి వారంలో బాగానే ఉన్న శివాజీ తన ఆట తో నాగార్జునను కూడా మెప్పించారు. ఇక రెండో వారం నుంచి నేను హౌస్ లో ఉండను వెళ్ళిపోతాను అంటూ కామెంట్స్ చేశాడు. దాంతో నాగార్జున కూడా అది బిగ్ బాస్ రూల్స్ కు వెతిరేకం. ఇంకోసారి హౌస్ నుంచి వెళ్ళిపోతానంటే.. మేమె పంపించేస్తాం అని వార్నింగ్ కూడా ఇచ్చారు. దాంతో శివాజీ హౌస్ లో తన ఆట ను మెరుగుపరిచారు.

అయితే ఇప్పుడు శివాజీ రెండో పవర్ అస్త్ర సాధించి హౌస్ మేట్ గా కన్ఫామ్ అయ్యారు. అయితే ఇప్పుడు శివాజీ ఆట తీరు మారిందని చూస్తున్న ప్రేక్షకులు అంటున్నారు. రెండు మూడు రోజుల నుంచి శివాజీ హౌస్ లో కొంతమందికు మాత్రమే ఫేవర్ గా వ్యవహరిస్తున్నారని అర్ధవవుతుంది. మొన్నటి ఎపిసోడ్ లోనూ గౌతమ్ తన నామినేషన్ గురించి చెప్తుంటే వినిపించుకోకుండా యావర్ కు సపోర్ట్ గా మాట్లాడాడు.

ఆ తర్వాత కూడా యావర్ కు, ప్రశాంత్ కు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు శివాజీ. నిన్నటి ఎపిసోడ్ లో యావర్, ప్రశాంత్ బజార్ దగ్గరే కూర్చొని తినడం ఎప్పుడు సౌండ్ వస్తే వెంటనే బజర్ ప్రెస్ చేయాలని చూశారు. ఇది కరెక్ట్ కాదు అని సందీప్ అంటున్నా కూడా శివాజీ యావర్, ప్రశాంత్ స్టాండ్ తీసుకొని మాట్లాడాడు. దాంతో సందీప్ కూడా సీరియస్ అయ్యాడు. అలాగే శోభా కూడా శివాజీ పై ఫైర్ అయ్యింది. ఈ ఇంట్లో ఎవరికీ లేదు, మీకు మాత్రమే ప్రతిదాన్ని గొడవ చేయాలని మీకే ఉంది’ అని శివాజీపై సీరియస్ అయ్యింది శోభా. ఆతర్వాత రతికాతో మాట్లాడుతూ.. మళ్లీ శివాజీ అదే పాట పాడాడు. నేను హౌస్ నుంచి వెళ్ళిపోతా ఉండాలని లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఉండబుద్ది అయితేలే బిడ్డా, కావట్లే..!ఒట్టమ్మా, ఇన్నిరోజులు దాసుకుని ఉండటం నా వల్ల కావట్లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. మరి దీని పై నాగ్ ఈ వారం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.