బిగ్ బాస్ సీజన్ 6 మొదలై ఇప్పటికే 45 రోజులు అవుతోంది. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ కాస్త నిరాశను కలియిస్తుందనే చెప్పాలి. ఈ విషయాన్నీ ప్రేక్షకులే కాదు నాగార్జున కూడా ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే వారాంతంలో వచ్చిన ప్రతిసారి హౌస్మేట్స్ కు కావాల్సినంత గడ్డి పెడుతున్నారు. ఆట అండండిరా అంటే అది తప్ప మిగిలిన సోదంతా చేస్తున్నారు. దాంతో నాగార్జున కూడా సహనం కోల్పోతున్నాడు. ఇప్పటికే చాలా సార్లు క్లాస్ కూడా తీసుకున్నాడు నాగ్. ఇక బిగ్ బాస్ కు కూడా అదే అనిపించిందేమో అందర్నీ నిలబెట్టి భారీ గట్టిగా క్లాస్ తీసుకున్నాడు. అందరు వెస్ట్ బయటకు వెళ్లిపోండి అంటూ ఫైర్ అయ్యాడు. అసలు బిగ్ బాస్ కే కోపం వచ్చేంతగా హౌస్ మేట్స్ వరస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు ఈసీజన్ లో.. మీకు బిగ్ బాస్ ఆదేశాలు అంటే నిర్లక్ష్యం.. టాస్క్‌ల పట్ల నిర్లక్ష్యం.. మీ నిర్లక్ష్యం బిగ్ బాస్‌నే కాకుండా ప్రేక్షకుల్ని కూడా నిరాశపరిచింది అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్.
మీకు ఫుడ్డు, బెడ్డు వెస్ట్ అన్నట్టుగా గేట్లు తెరిచి బయటకు వెళ్లిపొమ్మండు బిగ్ బాస్. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. ఈ టాస్క్‌లను రద్దు చేస్తున్నాం.. ఈ షోపట్ల.. ప్రేక్షకుల పట్ల గౌరవం లేకపోతే.. బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోండి అంటూ చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. ఆ తర్వాత శ్రీహన్ తన పర్ఫామెన్స్ చూపించాడు. కెమెరా దగ్గరకు వెళ్లి.. టైంకి తినాలి.. సోది ముచ్చట్లు పెట్టుకోవాలి.. ముందు వాళ్లకి బిగ్ బాస్ షో గురించి చెప్పండి బిగ్ బాస్.. మినిమమ్ క్లారిటీ లేదు.. ఇద్దరు ముగ్గురు చేసిన తప్పుల వల్ల అందరికీ ఎఫెక్ట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఆర్జేసూర్య గీతూ దగ్గర కూర్చొని.. మనం ఎంత ప్రయత్నం చేసినా.. మిగిలిన వాళ్ల వల్ల అది ఆగిపోతే చాలా పెయిన్ ఉంటాది అక్కా అంటూ చెప్పుకొచ్చాడు. గీతూ మరింత రెచ్చి పోయి “పది మంది దోషులకు శిక్షపడినా పర్లేదు కానీ.. ఒక నిర్దోషికి శిక్షపడకూడదు బిగ్ బాస్” అంటూ బిగ్ బాస్ కు ఉచిత సలహాను ఇచ్చింది. ఇదంతా చూసిన ప్రేక్షకులు ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.