Bigg Boss 6: ఆది రెడ్డిని ఉతికారేసిన నాగార్జున.. మరీ ఇంత సీరియస్ అయ్యారేంటి బిగ్ బాసూ..

|

Nov 20, 2022 | 8:26 AM

ఎవరైతే టాప్ లో ఉంటారనుకున్నారో వాళ్లంతా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు. ఇక వారాంతం వచ్చిందంటే చాలు కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో ఆటలాడిపాటాలు పాడిస్తుంటారు.

Bigg Boss 6: ఆది రెడ్డిని ఉతికారేసిన నాగార్జున.. మరీ ఇంత సీరియస్ అయ్యారేంటి బిగ్ బాసూ..
Bigg Boss 6
Follow us on

బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు రసవత్తరంగా మారింది. ఈ సీజన్ లో ఎవరు టాప్ 5లో ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్ లో ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. ఎవరైతే టాప్ లో ఉంటారనుకున్నారో వాళ్లంతా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు. ఇక వారాంతం వచ్చిందంటే చాలు కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో ఆటలాడిపాటాలు పాడిస్తుంటారు. అలాగే గేమ్ గురించి.. హౌస్ మేట్స్ ఆటతీరు గురించి క్లాస్ తీసుకుంటుంటారు. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో నాగ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఆదిరెడ్డి విషయంలో నాగార్జున చాలా సీరియస్ అయ్యారు. ఆడియన్స్‌పై ఉన్న నమ్మకంతో తనకి ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ వద్దని చెప్పి గేమ్ నుంచి పక్కకి తప్పుకోవడం.. ఫైమాని గెలిపించడం పై నాగ్ మండిపడ్డారు. అయితే ఆదిరెడ్డి మాట్లాడితే నా తప్పుంటే నేను వెళ్ళిపోతా అనడం నాగ్ కు నచ్చలేదు.

ఎందుకు ఆదిరెడ్డీ మాటిమాటికీ.. వీడియో చూపించమను.. గేట్లు తీయమను.. నేను వెళ్లిపోతా అని అంటావ్..’ అంటూ ఆ వీడియో ప్లే చేశారు. ఇష్టం వచ్చినట్టు స్టేట్ మెంట్‌లు ఇవ్వొద్దు.. అవి చూడ్డానికి చాలా చిరాకుగా ఉన్నాయి’ అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు నాగార్జున. అలాగే బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు ఆడాలి కానీ.. అడ్డమైన కారణాలతో ఆడకుండా ఉండకూడదు.. టాస్క్ ఆడకపోవడమే నీ టాస్కా?? నువ్వే కనుక ఆ టాస్క్ గెలిచి.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ నీకు వచ్చి ఉంటే.. ఒక జన్యూన్ కంటెస్టెంట్‌ని హౌస్‌లో నుంచి వెళ్లకుండా ఆపేవాడివి కదా.. అది సపోర్ట్ చేయడం కదా? అలా చేసి ఉంటే నిన్ను జనం ఎంత మెచ్చుకుంటారు? అని ప్రశ్నించారు నాగ్.

ఇనయ.. సూర్యకి గుర్తుగా.. అతని ప్లేట్‌లు కప్‌లు వాడుతుంది. అయితే శ్రీ సత్య, రేవంత్ ఆ ప్లేట్‌లను లోపల పెట్టేయడం.. వాటిపై ఉన్న పేర్లను చెరిపేయడం లాంటివి చేస్తున్నారు. ఈ కప్పుతో నీకొచ్చిన నష్టం ఏంట్రా నాయనా అంటే.. నా ఇష్టం అన్నట్టుగా మాట్లాడటంతో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ కెప్టెన్‌కి చురకలు వేశారు నాగార్జున. కప్పుల విషయంలో నువ్ చేసే రాద్ధాంతం కరెక్టా? నువ్ అధికారం చూపిస్తున్నావ్’ అని అన్నారు. ఆ తర్వాత ఇనాయ తో మాట్లాడుతూ.. ‘ఈ కప్పులు ఎమోషన్ ఎంతకాలం కొనసాగుతుంది.. ఇక్కడ ప్రాబ్లమ్ నీవల్లే’ అని అన్నారు నాగ్.

ఇవి కూడా చదవండి