Vishnu Manchu: వీడియో రిలీజ్ చేసి షాక్ ఇచ్చిన మంచు విష్ణు.. అసలు విషయం అదేనట

విష్ణు-మనోజ్‌లు బాహాటంగానే గొడవ పడిన వీడియో సోషల్‌ మీడియాలో రచ్చ లేపింది.. ఇప్పుడు మంచు మనోజ్‌తో వివాదంపై విష్ణు పోస్ట్‌ పెట్టాడు..

Vishnu Manchu: వీడియో రిలీజ్ చేసి షాక్ ఇచ్చిన మంచు విష్ణు.. అసలు విషయం అదేనట
Manchu Vishnu

Updated on: Mar 31, 2023 | 8:50 AM

ఇటీవల మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవగురించి అందరికి తెలిసిందే. ఇళ్లలోకి వచ్చి విష్ణు గొడవ చేస్తున్నారని మనోజ్ ఒక వీడియోను రిలీజ్ చేసి హాట్ టాపిక్ గా మారారు. ఆ తర్వాత విష్ణు ఈ వీడియో పై స్పందించాడు కూడా.. అలాగే మనోజ్ కూడా ఈ విషయం పై దాటేశాడు కూడా.. తాజాగా అదంతా తూచ్ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు మంచు విష్ణు ..

మంచు ఫ్యామిలీలో కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా వినిపించింది. దీనికి తోడు మొన్నటికి మొన్న విష్ణు-మనోజ్‌లు బాహాటంగానే గొడవ పడిన వీడియో సోషల్‌ మీడియాలో రచ్చ లేపింది.. ఇప్పుడు మంచు మనోజ్‌తో వివాదంపై విష్ణు పోస్ట్‌ పెట్టాడు..పైగా దిస్‌ ఈజ్‌ జస్ట్‌ బిగినింగ్‌ అని పెట్టిన పోస్ట్‌ రకరకాల ఊహలకు తెరలేపింది.

ఆ పోస్టులో ఇండియా బిగ్గెస్ట్ రియాలిటీ షో..హౌస్‌ ఆఫ్‌ మంచూస్‌ అని ఉండటమే ఇప్పడు జనాలకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. రియాలిటీ షో పబ్లిసిటీ స్టంటా అని కూడా కామెంట్లతో మంచు ఫ్యామిలీని అటాక్‌ చేస్తున్నారు. ఇంతకీ ఇది నిజమైన గొడవా లేకపోతే రియాలిటీ షోనా..