‘బిచ్చగాడు’ పాత్రకి మహేశ్‌బాబు బాగా సెట్‌ అవుతారు’.. విజయ్‌ ఆంటోనీ వైరల్ కామెంట్స్

|

May 16, 2023 | 9:54 PM

నటుడు విజయ్‌ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన ‘బిచ్చగాడు 2’ మే 19న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్‌ ఆంటోని స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ మువీ ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇక బిచ్చగాడు-2 మువీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన..

‘బిచ్చగాడు’ పాత్రకి మహేశ్‌బాబు బాగా సెట్‌ అవుతారు.. విజయ్‌ ఆంటోనీ వైరల్ కామెంట్స్
Bichagadu Character
Follow us on

నటుడు విజయ్‌ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన ‘బిచ్చగాడు 2’ మే 19న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్‌ ఆంటోని స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ మువీ ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇక బిచ్చగాడు-2 మువీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో పాల్గొని అభిమానులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒకవేళ బిచ్చగాడు సీక్వెల్‌ చిత్రాల్లో మీరుకాకుండా వేరే ఏ హీరో అయితే బాగుంటారు? అనే ప్రశ్నకు.. తెలుగులో సూపర్ స్టార్‌ మహేశ్‌బాబు సూట్ అవుతారన్నారు. తమిళంలో అయితే ఆ చిత్రానికి విజయ్‌గానీ, అజిత్‌గానీ సూట్‌ అవుతారని చెప్పుకొచ్చారు.

తన కొత్త సినిమా గురించి మాట్లాడుతూ.. బిచ్చగాడు-2లో హీరో పాత్ర బిచ్చగాడు కావడం వల్లనే ఈ సినిమాకి ‘బిచ్చగాడు 2’ పెట్టాం. 2016లో విడుదలైన బిచ్చగాడు కథకు ఇది సీక్వెల్‌ కాదు. ఈ రెండు కథలకు అస్సలు సంబంధమే ఉండదు. వ్యక్తిగతంగా నేను చాలా సున్నిత మనస్కుడిని. అందుకే సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఉన్న కథలు రాస్తుంటా. దర్శకుడి కోణం నుంచి చూస్తే నేనంత గొప్ప నటుణ్ని కాదని పేర్కొన్నారు. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ‘బిచ్చగాడు’ ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఐతే బిచ్చగాడు-2 అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌ ఉంటుందని వెల్లడించారు. తన తదుపరి చిత్రం తెలుగులో చేయబోతున్నానని తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటిస్తానన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.