Movie News: 100 ఏళ్ళ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్.. మోతమోగించిన సీనియర్ హీరోలు
4 సినిమాలు ఫస్ట్ వీకెండ్‌లో కేవలం మల్టీప్లెక్స్‌లలోనే 390 కోట్లు వసూలు చేసాయి. ఆగస్ట్ 10న జైలర్‌తో ఈ దండయాత్ర మొదలైంది. నెల్సన్ తెరకెక్కించిన ఈ చిత్రంతో రజినీకాంత్ దాదాపు 13 ఏళ్ళ తర్వాత ఫామ్‌లోకి వచ్చారు. మధ్యలో కబాలి, 2.0 ఓకే అనిపించినా.. అన్నిచోట్లా అవి హిట్ కాదు. కానీ జైలర్ మాత్రం 4 రోజుల్లోనే 330 కోట్లు వసూలు చేసి.. అన్ని భాషల్లోనూ బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాదు.. బ్లాక్‌బస్టర్ స్టేటస్ అందుకుంది.

జాకీర్ హుస్సేన్ తబలా వాయించినట్లు.. శంకర్ సినిమాలకు రెహమాన్ వాయించినట్లు.. నాలుగు రోజుల నుంచి నాన్ స్టాప్‌గా బాక్సాఫీస్‌ను వాయిస్తూనే ఉన్నారు సీనియర్ హీరోలు. ఓ వైపు జైలర్.. మరోవైపు గదర్ 2.. ఇంకోవైపు ఓ మై గాడ్ 2.. ఇలా ప్రతీ సినిమా చిన్న పిల్లాడు బంతితో ఆడుకున్నట్లు బాక్సాఫీస్‌ను మోత మోగించాయి. వీటి మధ్యలో భోళా శంకర్ పరిస్థితి ఏంటి..? అసలు ఈ సినిమాల ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్ ఏంటి..? చాలా రోజుల తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. అది కూడా అలా ఇలా కాదు.. 100 ఏళ్ళ సినిమా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా..! గతవారం విడుదలైన జైలర్, భోళా శంకర్, గదర్ 2, ఓ మై గాడ్ 2 సినిమాలను ఆగస్ట్ 10 నుంచి 13 వరకు ఏకంగా 2 కోట్ల 10 లక్షల మంది చూసారు.
ఈ విషయాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ 4 సినిమాలు ఫస్ట్ వీకెండ్‌లో కేవలం మల్టీప్లెక్స్‌లలోనే 390 కోట్లు వసూలు చేసాయి. ఆగస్ట్ 10న జైలర్‌తో ఈ దండయాత్ర మొదలైంది. నెల్సన్ తెరకెక్కించిన ఈ చిత్రంతో రజినీకాంత్ దాదాపు 13 ఏళ్ళ తర్వాత ఫామ్‌లోకి వచ్చారు. మధ్యలో కబాలి, 2.0 ఓకే అనిపించినా.. అన్నిచోట్లా అవి హిట్ కాదు. కానీ జైలర్ మాత్రం 4 రోజుల్లోనే 330 కోట్లు వసూలు చేసి.. అన్ని భాషల్లోనూ బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాదు.. బ్లాక్‌బస్టర్ స్టేటస్ అందుకుంది. ఈజీగా 500 కోట్ల వైపు పరుగులు తీస్తున్నారు సూపర్ స్టార్. ఆగస్ట్ 11న విడుదలైన భోళా శంకర్ మాత్రం వసూళ్ల వేటలో వెనకబడింది. మొదటిరోజు 18 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం.. తర్వాత 2 రోజుల్లో కేవలం 7 కోట్లు మాత్రమే తీసుకొచ్చింది. ఫస్ట్ వీకెండ్ భోళా శంకర్‌కు వరల్డ్ వైడ్‌గా 25 కోట్ల షేర్ వచ్చింది.
బాలీవుడ్‌కు కూడా ఈ వారం బాగా కలిసొచ్చింది. ఆగస్ట్ 11న విడుదలైన ఓ మై గాడ్ 2, గదర్ 2లకు అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2కి ఫస్ట్ డే 10 కోట్లు రాగా.. తర్వాత రెండు రోజుల్లో వరసగా 15, 17 కోట్లు వచ్చాయి. ఇక సన్నీ డియోల్ గదర్ 2 అయితే 3 రోజుల్లోనే కేవలం ఇండియాలో 138 కోట్లు వసూలు చేసింది. మొత్తానికి ఇండిపెండెన్స్ డే వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర మోత మోగిపోయిందన్నమాట. 100 ఏళ్ళ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ ఆగస్ట్ 10 నుంచి 13 వరకు 2 కోట్ల 10 లక్షల టికెట్స్ కొనుగోలు మల్టీప్లెక్స్‌లలో 4 సినిమాల ఫస్ట్ వీకెండ్ బిజినెస్ 390 కోట్లు 4 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 330 కోట్లు వసూలు చేసిన జైలర్ 500 కోట్ల వైపు పరుగులు తీస్తున్న సూపర్ స్టార్ భోళా శంకర్ ఫస్ట్ డే కలెక్షన్ 18 కోట్లు వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ 25 కోట్లు షేర్ ఓ మై గాడ్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ 10 కోట్లు.. తర్వాత రోజుల్లో 15, 17 కోట్లు సన్నీ డియోల్ గదర్ 2కు 3 రోజుల్లోనే 138 కోట్లు.
Pagayaagip pona, Baliyaava veena🔥🗡️
Experience the action-loaded #Jailer in theatres near you!@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @mirnaaofficial… pic.twitter.com/9s84fstNw1
— JAILER (@Jailer_Movie) August 15, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




