AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger: ధనవంతులను చేసిన స్టాక్‌ గురించి తెలుసా? 1 లక్ష రూపాయలు రూ.50 లక్షలుగా మారింది!

Multibagger: డిసెంబర్ త్రైమాసికంలో కాబ్రా డ్రగ్స్ రూ.30.42 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది సెప్టెంబర్ 2025 త్రైమాసికంలో నమోదైన రూ. 19.76 కోట్ల నుండి 53.9 శాతం బలమైన వృద్ధిని చూపుతోంది. డిసెంబర్ 2024 త్రైమాసికంలో నివేదించిన జీరో ఆదాయం నుండి భారీ టర్నరౌండ్‌ను చూపుతోంది.

Multibagger: ధనవంతులను చేసిన స్టాక్‌ గురించి తెలుసా? 1 లక్ష రూపాయలు రూ.50 లక్షలుగా మారింది!
Multibagger
Subhash Goud
|

Updated on: Feb 18, 2026 | 5:59 PM

Share

Kabra Drugs Multibagger: స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న అస్థిరత గణనీయమైన రాబడిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న స్టాక్‌ల ప్రాముఖ్యతను హైలైట్ అవుతున్నాయి. చాలా సందర్భాలలో స్టాక్-నిర్దిష్ట పెట్టుబడులు బెంచ్‌మార్క్ సూచికల కంటే గణనీయంగా ఎక్కువ రాబడిని అందించాయి. అయితే పెద్ద లాభాలతో పాటు రిస్క్ పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టే ముందు వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రమశిక్షణ కలిగిన దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహం అలవర్చుకోవడం ముఖ్యమైన అంశాలు.

ఇక్కడ అలాంటి ఒక స్టాక్ గురించి తెలుసుకుందాం. అది కాబ్రా డ్రగ్స్. ఈ పెన్నీ స్టాక్ నిరంతరం విస్తృత మార్కెట్‌ను అధిగమిస్తూ దాని పెట్టుబడిదారులకు భారీ రాబడిని అందించింది. ఫిబ్రవరి 2019లో 65 పైసలుగా ఉన్న కాబ్రా డ్రగ్స్ షేరు ధర ఇప్పుడు BSEలో రూ.32 వద్ద ట్రేడవుతోంది. ఈ విధంగా చెప్పాలంటే ఆరు సంవత్సరాల క్రితం స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి దానిని కాలక్రమేణా ఉంచుకుంటే ఏడు సంవత్సరాలలో రూ.50 లక్షల విలువ వచ్చేది.

Term Insurance: నెలకు రూ.1000 కడితే చాలు 1 కోటి రూపాయలు.. మీరు అప్పులు తీర్చాల్సిన అవసరమే లేదు!

కాబ్రా డ్రగ్స్ షేర్ ధర:

కాబ్రా డ్రగ్స్ షేర్లు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు సంపదను గుణించేవిగా ఉన్నాయి. గత ఏడు సంవత్సరాలలో 4960% మల్టీబ్యాగర్ రాబడిని అందించాయి. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఐదు సంవత్సరాలలో 589%, మూడు సంవత్సరాలలో దాదాపు 514% లాభపడింది. స్వల్పకాలంలో కూడా మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉన్నప్పటికీ ఈ స్టాక్ పెట్టుబడిదారులను ఆకట్టుకోగలిగింది. ఈ స్టాక్ ఒక సంవత్సరంలో 209% రాబడిని అందించింది. అయితే ఈ కాలంలో BSE సెన్సెక్స్ కేవలం 10% పెరుగుదలను చూసింది. ఇంకా మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ ఆరు నెలల్లో 65% కంటే ఎక్కువ, ఒక నెలలో 17% పెరిగింది.

ఇవి కూడా చదవండి

కాబ్రా డ్రగ్స్ ఇటీవలి వ్యాపార అప్‌డేట్స్‌

అధిక వృద్ధి చెందుతున్న రంగాలలోకి దాని విస్తరణ జనవరి 2026 ప్రారంభంలో ఆమోదించిన అనేక వ్యూహాత్మక ప్లాన్స్‌, బలమైన పెట్టుబడిదారుల ఉత్సాహం స్టాక్ ధరను పెంచడానికి దోహదపడ్డాయి. మంగళవారం కంపెనీ నికర లాభంలో 578 శాతం (YoY) పెరుగుదలను FY26 డిసెంబర్ త్రైమాసికానికి రూ. 2.56 కోట్లకు చేరుకుందని నివేదించింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.53.69 లక్షల నష్టంతో పోలిస్తే.

Bank Account: బ్యాంకు అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం ఖచ్చితంగా తెలియాల్సిందే!

PTI నివేదిక ప్రకారం.. డిసెంబర్ త్రైమాసికంలో కాబ్రా డ్రగ్స్ రూ.30.42 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది సెప్టెంబర్ 2025 త్రైమాసికంలో నమోదైన రూ. 19.76 కోట్ల నుండి 53.9 శాతం బలమైన వృద్ధిని చూపుతోంది. డిసెంబర్ 2024 త్రైమాసికంలో నివేదించిన జీరో ఆదాయం నుండి భారీ టర్నరౌండ్‌ను చూపుతోంది.

అదనంగా కాబ్రా డ్రగ్స్ దేశవ్యాప్తంగా 200 ఛానల్ భాగస్వాములను చేర్చుకోవడానికి MR ఫ్రాంచైజీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా దాని పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, మార్కెట్ పరిధిని విస్తరించడం జరిగింది. జనవరి 1న కంపెనీ బోర్డు వాస్మాన్ ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయడం, కంపెనీ పేరు మార్పు, పంపిణీ నెట్‌వర్క్ విస్తరణ ప్రధాన లక్ష్యం (MOA)లో మార్పును ఆమోదించింది.

మీ BSNL నంబర్‌ డీయాక్టివేట్‌ అయ్యిందా? మీకో గుడ్‌న్యూస్‌.. చౌకైన ప్లాన్‌తో 90 రోజులు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us