Tollywood: నయా మూవీ లేటెస్ట్ అప్డేట్స్.. షూటింగ్స్‌తో బిజీ బిజీగా గడిపేస్తున్న యంగ్ హీరోలు
ఖుషీ విడుదల దగ్గరికి వస్తున్నా.. విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా షూటింగ్స్‌తోనే బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో ఉన్నారు. సంక్రాంతి విడుదలే టార్గెట్‌గా వస్తుందివిజయ్ దేవరకొండ13. ఇక చాలా రోజుల తర్వాత మారుతి సినిమాకు డేట్స్ ఇచ్చారు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్ కోకపేట్ హౌస్ సెట్‌లో జరుగుతుంది.

భోళా శంకర్ రిలీజ్ తర్వాత ఖాళీగానే ఉన్నారు చిరంజీవి.. రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పవన్ కళ్యాణ్ అనధికారికంగా సెలవులు తీసుకున్నారు.. ఇక నాగార్జున వెండితెర కంటే బుల్లితెరపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.. తండ్రి అలా ఉంటే తనయులు అఖిల్, నాగ చైతన్య నెక్ట్స్ సినిమాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. వీళ్లు మినహా.. మిగిలిన హీరోలంతా సెట్స్‌పైనే ఉన్నారు. మరి వాళ్లెక్కడున్నారు.. ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది.? ఖుషీ విడుదల దగ్గరికి వస్తున్నా.. విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా షూటింగ్స్‌తోనే బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో ఉన్నారు. సంక్రాంతి విడుదలే టార్గెట్‌గా వస్తుందివిజయ్ దేవరకొండ13. ఇక చాలా రోజుల తర్వాత మారుతి సినిమాకు డేట్స్ ఇచ్చారు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్ కోకపేట్ హౌస్ సెట్‌లో జరుగుతుంది.
ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ శంషాబాద్‌లో జరుగుతుంది. ఇండియన్ 2 నుంచి గేమ్ ఛేంజర్‌కు వచ్చిన శంకర్.. రెండు వారాలుగా రామ్ చరణ్ సినిమా సెట్‌లోనే ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ నిజాం కాలేజ్‌లో జరుగుతుంది. అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప2 షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా.. అక్కడే బాలకృష్ణ, అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ వెంకట్ ఆధ్వర్యంలో ఇది తెరకెక్కిస్తున్నారు.
మాస్ మహరాజా రవితేజ ఒకేసారి రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ శంషాబాద్‌లో జరుగుతుండగా.. కార్తీక్ ఘట్టమనేని ఈగల్ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఇందులో టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న.. ఈగల్ సంక్రాంతికి రానున్నాయి. గోపీచంద్, శ్రీహర్ష భీమా.. సిద్ధూ జొన్నలగడ్డ డిజే టిల్లు స్క్వేర్.. కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా షూటింగ్స్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నాయి.
విజయ్ దేవరకొండ ఖుషి సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
View this post on Instagram
నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్
View this post on Instagram
మత్యకారుల జీవిత కథతో నాగ చైతన్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




