AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంటి ముఖద్వారం వద్ద ఈ తప్పులు చేస్తున్నారా? ఆ శక్తులకు వెల్కమ్ చెప్పినట్టే!

ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకున్నా.. గుమ్మం వద్ద చేసే చిన్న చిన్న పొరపాట్లు కుటుంబ ప్రశాంతతను దెబ్బతీస్తాయి. సింహద్వారం వద్ద ఉంచే కొన్ని వస్తువులు ప్రతికూల శక్తిని (Negative Energy) ఆకర్షిస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇంట్లో సామరస్యం చెడిపోవడం, గొడవలు, డబ్బు నష్టం వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

Vastu Tips: ఇంటి ముఖద్వారం వద్ద ఈ తప్పులు చేస్తున్నారా? ఆ శక్తులకు వెల్కమ్ చెప్పినట్టే!
Vastu Tips For Main Door
Bhavani
|

Updated on: Feb 18, 2026 | 3:51 PM

Share

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం కేవలం రాకపోకలకే కాదు, శక్తి ప్రసారానికి కూడా ముఖ్య కేంద్రం. అందుకే ముఖద్వారం ఎప్పుడూ శుభప్రదంగా ఉండాలి. అయితే, తెలియక మనం గుమ్మం వద్ద ఉంచే కొన్ని వస్తువులు ఇంట్లోకి నెగెటివ్ వైబ్రేషన్స్‌ను తీసుకొస్తాయి. ఫలితంగా మానసిక అశాంతి, ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. వాస్తు నిపుణుల సూచనల ప్రకారం గుమ్మం వద్ద ఉండకూడని వస్తువులు ఇవే..

ముళ్ల మొక్కలతో జాగ్రత్త!

ఇంటి ముఖద్వారానికి ఎదురుగా కాక్టస్ లేదా గులాబీ వంటి ముళ్ల మొక్కలను అస్సలు పెట్టకూడదు. అలాగే ఎండిపోయిన లేదా వాడిపోయిన మొక్కలు ఉంచడం వల్ల దురదృష్టం వెన్నాడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. పచ్చని, శుభప్రదమైన మొక్కలను మాత్రమే గుమ్మం వద్ద పెంచుకోవాలి.

అద్దాల మాయాజాలం!

చాలామంది ఇంటి ముందు గోడకు అద్దాలు తగిలిస్తుంటారు. వాస్తు ప్రకారం, సింహద్వారానికి ఎదురుగా అద్దాలు ఉంటే, ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ తిరిగి వెనక్కి వెళ్లిపోతుంది. గాజు వస్తువులు లేదా పగిలిన అద్దాలు ముఖద్వారం వద్ద అస్సలు ఉండకూడదు.

ఆయుధాలు పగిలిన వస్తువులు!

కత్తులు, గొడ్డళ్లు లేదా ఇతర పదునైన ఆయుధాలను గుమ్మం వద్ద పెట్టడం ప్రమాదాలకు సంకేతం. వీటిని స్టోర్ రూమ్‌లో దాచడం ఉత్తమం. అలాగే విరిగిపోయిన పాత వస్తువులను, పనికిరాని సామాన్లను ఇంటి ముందు ఉంచడం వల్ల జీవితంలో ఆటంకాలు ఎదురవుతాయి.

చెప్పుల స్టాండ్ ఎక్కడ ఉండాలి?

సాధారణంగా అందరూ చెప్పులను గుమ్మానికి అడ్డంగా విడుస్తుంటారు. ఇది చాలా పెద్ద వాస్తు దోషం. చెప్పులను ఎప్పుడూ గుమ్మానికి పక్కన, ఒక క్రమ పద్ధతిలో షూ రాక్‌లో ఉంచాలి. ఎలా పడితే అలా విడవడం వల్ల ఇంటి యజమాని గౌరవం తగ్గుతుందని పండితులు చెబుతుంటారు.

చెత్త చీకటి – దరిద్రానికి సంకేతం!

ఇంటి ముఖద్వారం వద్ద చెత్త బుట్టలను పెట్టడం లేదా చెత్తను పోగు చేయడం అస్సలు చేయకూడదు. ఇది నెగెటివ్ ఎనర్జీని ఆహ్వానించడమే. అలాగే, గుమ్మం వద్ద ఎప్పుడూ వెలుతురు ఉండాలి. చీకటిగా ఉండే సింహద్వారం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుంది. కాబట్టి అక్కడ ఎప్పుడూ బ్రైట్ లైట్లు ఉండేలా చూసుకోవాలి.

ఇంటి ప్రధాన ద్వారం లక్ష్మీదేవి ప్రవేశించే మార్గమని నమ్ముతారు. అందుకే దాన్ని ఎప్పుడూ శుభ్రంగా, వెలుతురుతో ఉంచడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Follow Us