Barrelakka: పెళ్లికళ వచ్చేసిందే బాల.. గుడ్ న్యూస్ చెప్పిన బర్రెలక్క.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
వచ్చిన పాపులారిటీతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది బర్రెలక్క.. ఆ ఎన్నికల్లో అంతగా ఆమె ప్రభావం చూపలేకపోయింది. పెద్ద పెద్ద సార్లు ఆమెకు సపోర్ట్ చేసినా కూడా ఆమె అంతగా ఓట్లు రాబట్టలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది బర్రెలక్క.

బర్రెలక్క గుర్తుందా..? సోషల్ మీడియాలో ఒకే ఒక్క వీడియోతో బాగా పాపులర్ అయ్యింది. డిగ్రీ చదువుకున్నా కూడా ఉద్యోగం రాలేదని దాంతో బర్రెలు కాస్తున్నా అని చెప్పి వైరల్ అయ్యింది. అప్పుడు ఆ వీడియో పెద్ద సంచలనమే.. దాంతో వచ్చిన పాపులారిటీతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది బర్రెలక్క.. ఆ ఎన్నికల్లో అంతగా ఆమె ప్రభావం చూపలేకపోయింది. పెద్ద పెద్ద సార్లు ఆమెకు సపోర్ట్ చేసినా కూడా ఆమె అంతగా ఓట్లు రాబట్టలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది బర్రెలక్క. తాజాగా ఆమెకు సంబందించిన ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. బర్రెలక్క త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది.
బర్రెలక్క అలియాస్ శిరీష.. సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె పెళ్లి చేసుకోబోతున్న అని ఓ వీడియోను షేర్ చేసింది. గతంలో చాలా మంది శిరీషను ట్రోల్ చేశారు. తనకు అల్ రెడీ పెళ్లిఅయిందని.. విడాకులు తీసుకుందని లేనిపోని పుకార్లు పుట్టించారు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ తో బర్రెలక్క పెళ్లి అంటూ రూమర్స్ వచ్చాయి. వాటిపై శిరీష ఘాటుగానే స్పందించింది. ఇక ఇప్పుడు తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు స్వయంగా తెలిపింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.
ఇదిలా ఉంటే ఆమె షేర్ చేసిన వీడియోలో ఎంగేజ్ మెంట్ కు ఎవ్వరిని పిలవలేకపోయాను. సడన్ గా పెట్టుకోవడం వల్ల కుదరలేదు. అయితే ఆమె ఎవరిని పెళ్లాడబోతుంది. అతని పేరు, వివరాలు తెలుపలేదు బర్రాలక్క. ఆమె ఫ్యాన్స్ చాలా మంది మేకప్ గురించి అడిగారట అందుకని మేకప్ వేయించుకుంటున్న వీడియోను షేర్ చేస్తూ ఈ విషయాన్నీ తెలిపింది బర్రెలక్క ..
బర్రెలక్క ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
బర్రెలక్క ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
