Barack Obama : బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే.. ఆ మూవీ ప్రత్యేకత ఏంటంటే..

|

Dec 21, 2024 | 12:09 PM

నూతన సంవత్సరం ప్రారంభం కావడానికి ఇంకా కొన్నిరోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఈ ఏడాదిలో జరిగిన సంఘటనలను, సినిమాలను, ముఖ్యమైన విషయాలను గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం తనకు ఈ ఏడాది నచ్చిన భారతీయ సినిమాను వెల్లడించారు.

Barack Obama : బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే.. ఆ మూవీ ప్రత్యేకత ఏంటంటే..
Barak Obama
Follow us on

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మనసు గెలుచుకుంది ఓ భారతీయ సినిమా. దీంతో ఇప్పుడు ఆ మూవీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. 2024లో తనకు బాగా నచ్చిన చిత్రాలు, పుస్తకాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ తెలియజేస్తూ బరాక్ ఒబామా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆయన షేర్ చేసిన చిత్రాల జాబితాలో భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్ (All We Imagine as Light) సినిమా మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమానే కాకుండా ఈ ఏడాది తనకు మనసుకు దగ్గరైన సినిమాల జాబితాను షేర్ చేశారు బరాక్ ఒబామా. “ఈ ఏడాది నా మనసుకు దగ్గరైన సినిమాలు ఇవే. కాన్ క్లేవ్, ది పియానో లెసెన్, ది ప్రామిస్ట్ ల్యాండ్, ది సీడ్ ఆఫ్ ది సెక్రెడ్ ఫిగ్, డ్యూన్ : పార్ట్ 2, అనోరా, దీదీ, ఘగర్ కేన్, ఎ కంప్లీట్ అన్ నోన్ సినిమాలు.. లంచ్‌, యాయో, జంప్, ఫేవరెట్‌, యాక్టివ్‌, గోల్డ్‌ కోస్ట్‌ వంటి మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ నచ్చాయి ” అంటూ రాసుకొచ్చారు. అంతేకాకుండా.. ది యాంగ్జియస్ జనరేషన్, స్టోలెన్ ఫ్రైడ్, గ్రోత్, ఆర్బిటల్, ది వర్క్ ఆఫ్ ఆర్ట్ వంటి రచనల గురించి ప్రస్తావించారు.

All We Imagine as Light సినిమా గురించి ఒబామా మాట్లాడటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీంతో ఈ సినిమా గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాయల్ కపాడియా తెరకెక్కించారు. ముంబయి నర్సింగ్ హోంలో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథే ఈ ‘ఆల్‌ వీ ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ చిత్రం. ఈ సినిమాలో కనికుశ్రుతి, దివ్య ప్రభ, చాయాకదం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ సినిమా ఇప్పటికే గ్రాండ్ పిక్స్ అవార్డ్ గెలుచుకుంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత భారతీయ సినిమాకు దక్కిన గౌరవమిది. 82వ గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాలకు ఈ సినిమా నామినేట్ అయ్యింది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లో నామినేషన్లను దక్కించుకుంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇప్పుడు ఒబామా సైతం ఈ సినిమా పేరును ప్రస్తావించడంతో ఇప్పుడు మరోసారి ఈ సినిమా గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ చిత్రాన్ని రానా తెలుగులో విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.