Sita Kalyanam: గ్రాఫిక్స్ లేని రోజుల్లో బాపు తెరకెక్కించిన గంగవతారం సీన్.. అప్పట్లో బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో పాఠ్యంశం..
టాలీవుడ్ లో ఫేమస్ డైరెక్టర్ బాపు గురించి ఎంత చెప్పినా తక్కువే. సుమారు 40 ఏళ్ల క్రితం బాపు రామాయణం ఇతి వృత్తంగా తీసుకుని సీతా కళ్యాణం సినిమాను తెరకెక్కించారు. రవి రాముడిగా జయప్రద సీతా తెరకెక్కిన ఈ సినిమా అద్భుత దృశ్య కావ్యంగా ఇప్పటికీ సినీ ప్రేక్షకుల మన్నలను అందుకుంటూనే ఉంది.
రామాయణ, మహాభారతం పురాణం ఇతిహాసాలు కాదు.. మానవ జీవన ప్రయాణానికి మార్గ నిర్దేశకాలు.. రామాయణంలోని పాత్రలు మనిషి ఎలా జీవించాలో నేర్పిస్తే.. మహాభారతంలోని పాత్రలు ఎలా జీవించరాదో తెలియజేస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అంతేకాదు.. టాలీవుడ్, కోలీవుడ్ బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడు లోనైనా సరే కథలకు ప్రేరణగా రామాయణం నిలుస్తుందని పలువురు దర్శకులు చెబుతూనే ఉంటారు.
అంతేకాదు టాలీవుడ్ లో ఫేమస్ డైరెక్టర్ బాపు గురించి ఎంత చెప్పినా తక్కువే. సుమారు 40 ఏళ్ల క్రితం బాపు రామాయణం ఇతి వృత్తంగా తీసుకుని సీతా కళ్యాణం సినిమాను తెరకెక్కించారు. రవి రాముడిగా జయప్రద సీతా తెరకెక్కిన ఈ సినిమా అద్భుత దృశ్య కావ్యంగా ఇప్పటికీ సినీ ప్రేక్షకుల మన్నలను అందుకుంటూనే ఉంది. అంతేకాదు ఈ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో గ్రాఫిక్స్, వంటి ఆధునిక సౌకర్యాలు దర్శకులకు అందుబాటులో లేవు. ఆ సమయంలోనే బాపు దర్శకత్వంలో ముళ్ళపూడి స్క్రీన్ ప్లే తో ప్రతి సన్నివేశాన్ని అత్యంత సుందరంగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే గంగావతరణం సీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని అంటారు.
1976లో రిలీజైన ఈ సీతాకళ్యాణం.. రామాయణంలోని బాల కాండ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా అప్పట్లో ఉత్తమ దర్శకత్వం (తెలుగు) ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. అంతేకాదు 1978లో BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్, చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ , శాన్ రెనో, డెన్వర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. విదేశీ సినీ ప్రముఖులతో ప్రశంసలను అందికుంది. అంతేకాదు అప్పట్లో ఈ సినిమాలోని గంగావతరణ సన్నివేశ చిత్రీకరణ బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వారు తమ తరగతిల్లో పాఠ్యంశంగా బోధించేవారు. తెలుగు వారి ప్రతిభకు తార్కాణంగా నిలిచింది బాపు రమణల సీతాకళ్యాణం..
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..