Balakrishna: వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదిక మార్పు.. అక్కడ నిర్వహించేందుకు అనుమతినిచ్చిన పోలీసులు..
మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇందులో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ , సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తోన్న వీరసింహా రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక మారింది. ముందుగా ఒంగోలులో ఈనెల 6న ఎబీఎం కాలేజీ మైదానంలో ఈవెంట్ నిర్వహించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్లు అందుకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఆ ప్రాంగణంలో వేడుక నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అధిక సంఖ్యలో ప్రజలు వచ్చేందుకు అవకాశం ఉందని..కాబట్టి నగరంలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని.. బాలయ్య అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని వేదిక మార్చుకోవాలని చిత్రయూనిట్ కు తెలియజేశారు. దీంతో ఈసినిమా వేదికను ఏబీఎన్ కాలేజీ నుంచి త్రోవగుంట సమీపంలోని అర్జున్ ఇన్ఫ్రా స్థలానికి మార్చేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు.
ఏబీఎన్ కాలేజీ దగ్గర పార్కింగ్ లేకపోవడం, ఎదురుగా రైల్వే స్టేషన్ ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో వేదికను మార్చారు నిర్వాహకులు. ఇక ఈనెల 6న ఒంగోలులో యధావిధిగా వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ త్రోవగుంట సమీపంలోని అర్జున్ ఇన్ఫ్రా స్థలంలో జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు అనుమతి ఇచ్చామని చెబుతున్నా… రాతపూర్వకంగా అనుమతులు ఇంకా చేతికందకపోవడంతో లారీల్లోనే సామాన్లు ఉంచి వెయిట్ చేస్తున్నారు నిర్వాహకులు…
మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇందులో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ , సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.