Balakrishna: ‘భగవంత్ కేసరి’ వచ్చేసిండు.. బాలకృష్ణ బర్త్ డే ట్రీట్ అదిరిపోయిందిగా.. ఇగ మాస్ ఊచకోత షురూ..
మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో కాజల్, శ్రీలీల కీలకపాత్రలలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. రోజు రోజుకీ ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలోనే గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓప్రాజెక్ట్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో కాజల్, శ్రీలీల కీలకపాత్రలలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. రోజు రోజుకీ ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలోనే గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ టైటిల్ గురించి ఆసక్తికర విషయాలు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. అయితే ముందుగానే ప్రకటించినట్లుగా జూన్ 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా రెండు రోజుల ముందుగానే టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లోని108 హోర్డింగ్స్ మీద టైటిల్ పోస్టర్స్ వేశారు.
బాలయ్య, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న ఈ మూవీకి భగవంత్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. గురువారం ఉదయం టైటిల్ తోపాటు… బాలకృష్ణ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక పుట్టినరోజు నాడు భగవంత్ కేసరి టీజర్ విడుదల చేయనున్నారు. విజయ దశమి కానుకగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
ఇక భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య సరికొత్త పాత్రలో కనిపించనున్నారట. అలాగే ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల పాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది.
అన్న దిగిండు? ఇగ మాస్ ఊచకోత షురూ ?
Presenting #NandamuriBalakrishna in & as #BhagavanthKesari ?#NBKLikeNeverBefore ❤️?@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @JungleeMusicSTH pic.twitter.com/aIAYbnMgcK
— Shine Screens (@Shine_Screens) June 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.